WTC Final: ‘శ్రీలంకకు అంత సీన్ లేదు.. భారత్‌దే ఫైనల్‌ బెర్త్’.. లంకేయులపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ క్రికెటర్..

|

Mar 09, 2023 | 4:36 PM

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆసీస్ ఇప్పటికే చేరుకోగా, ప్రత్యర్థి స్థానం  కోసం ఇండియా, శ్రీలంక మధ్య పోటీ నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో మంజ్రేకర్ శ్రీలంక ఆటతనంపై ఈ సంచలన వ్యాఖ్యలు..

WTC Final: ‘శ్రీలంకకు అంత సీన్ లేదు.. భారత్‌దే ఫైనల్‌ బెర్త్’.. లంకేయులపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ క్రికెటర్..
Manjrekar On Wtc Final And Sl Vs Nz
Follow us on

Manjrekar on WTC Final: న్యూజిలాండ్‌ను వారి దేశంలోనే ఓడించే సత్తా శ్రీలంకకు లేదని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆసీస్ ఇప్పటికే చేరుకోగా, ప్రత్యర్థి స్థానం  కోసం ఇండియా, శ్రీలంక మధ్య పోటీ నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో మంజ్రేకర్ శ్రీలంక ఆటతనంపై ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు నుంచి ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ గెలిస్తే టీమిండియా నేరుగా ఫైనల్ చేరుతుంది. లేదంటే శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆసీస్‌ చేతిలో భారత్ ఓడిపోతే లేదా డ్రా చేసుకుంటే.. అటు న్యూజిలాండ్‌పై శ్రీలంక 2-0తో గెలిస్తే టీమిండియాకు బదులుగా లంకేయుల జట్టు ఫైనల్‌కు వెళ్తుంది. లంక, కివీస్ జట్ల మధ్య ఈ రెండు టెస్టుల సిరీస్ కూడా ఈ రోజే ప్రారంభం కాగా.. తొలి రోజే శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది.

అయినప్పటికీ న్యూజిలాండ్‌ను వాళ్ల స్వదేశంలోనే ఓడించే సత్తా శ్రీలంకకు లేదని మంజ్రేకర్ అనడం విశేషం.‘ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ అద్భుతంగా ప్రారంభమైంది. మేమూ గ్రౌండ్‌లోనే ఉన్నాం. ఈ టెస్టులో ఎన్నో జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. స్టేడియంలోని ప్రతి సీట్లో ప్రేక్షకులు ఉండటం గొప్ప అనుభూతి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరువలో భారత్ ఉంది. ఫైనల్‌కు ఇండియానే వెళ్తుందని అనుకుంటున్నా. న్యూజిలాండ్‌పై గెలిచే సత్తా శ్రీలంకకు ఉందని అనుకోవడం లేదు’ అని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.

ఇంకా మాట్లాడుతూ..‘భారత్ ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిందని నేను నమ్ముతున్నాను. కానీ అధికారికంగా వెళ్లాల్సి ఉంది. ఆ టెన్షన్ అయితే ఉంది. అంతేకాకుండా ఈ సిరీస్ విజేత కూడా తేలాల్సి ఉంది. ఇండోర్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బలంగా పుంజుకుంది. స్టేడియంలో నరేంద్ర మోదీ కూడా కూర్చున్నారు. ఆ బజ్ స్టేడియంలో కనిపించింది’ అని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. అయితే ఆహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ చివరి టెస్టులోనూ ఆస్ట్రేలియా బ్యాటర్లు మెరుగ్గానే ఆడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..