స్టార్ ప్లేయర్లను సుస్సు పోయించిన టీమిండియా బ్యాడ్‌లక్ ప్లేయర్.. క్రీజులోకి రావాలంటేనే వణుకు..

Sandeep Sharma Career: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతోన్న సందీప్ శర్మ.. సత్తా చాటుతూ దూసుకెళ్తున్నాడు. అయితే, తను పడగొట్టే వికెట్లలో ఓ ప్రత్యేకత చూపిస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే సీన్ రిపీట్ చేసి ఔరా అనిపించాడు.

స్టార్ ప్లేయర్లను సుస్సు పోయించిన టీమిండియా బ్యాడ్‌లక్ ప్లేయర్.. క్రీజులోకి రావాలంటేనే వణుకు..
Sandeep Sharma

Updated on: Apr 08, 2026 | 3:09 PM

ఐపీఎల్ 2026లో ఉత్కంఠ మ్యాచ్ లు జరుగుతున్నాయి. కొంతమంది బ్యాటర్లు, మరికొంతమంది బౌలర్లు తమ సత్తా చాటుతూ అటు పరుగులు, ఇటు వికెట్లు కొల్లకొడుతున్నారు. ఈ క్రమంలో ఓ ప్లేయర్ మాత్రం తనమైన శైలిలో స్టార్ ప్లేయర్లకు వరుసగా షాక్ లు ఇస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ 32 ఏళ్ల ప్లేయర్ వచ్చిన అవకాశాలను సక్రమంగా వినియోగించుకుంటూ కీలక మ్యాచ్ ల్లో వికెట్లు తీస్తూ సత్తా చాటుతున్నాడు. అయితే, ఈ ప్లేయర్ కు భారత జట్టు తరపున ఆడే అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి. కానీ, ఐపీఎల్ లో మాత్రం తన దూకుడు చూపిస్తూ స్టార్ ప్లేయర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ప్లేయర్ ఎవరో అని ఆలోచిస్తున్నారా.. ఆయన పేరు సందీప్ శర్మ.

140 మ్యాచ్ ల్లో 149 వికెట్లు..

సందీప్ వర్మ ఇప్పటి వరకు ఐపీఎల్ లో మూడు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 140 మ్యాచ్ లు ఆడి 149 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ వికెట్లలో చాలా వరకు స్టార్ ప్లేయర్లవే ఉండడం గమనార్హం. వాళ్ల వికెట్లు తీయడం సందీప్ శర్మకు వెన్నతో పెట్టిన విద్యలా మారింది.

కోహ్లీ అగ్రస్థానంలో..

సందీప్ శర్మ తీసిన పెద్ద పేర్లలో విరాట్ కోహ్లీ ముందున్నాడు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ పాలిట విలన్ లా మారాడు. ఆ తర్వాత లిస్ట్ లో రోహిత్ శర్మ, క్రిస్ గేల్, సూర్యకుమార్ యాదవ్ లుఉన్నారు. ఆ తర్వాత లిస్ట్ లో శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.

గణాంకాలు ఇవే..

విరాట్ కోహ్లీని 7 సార్లు పెవిలియన్ చేర్చిన సందీప్ శర్మ. ఆ తర్వాత రోహిత్ శర్మను 6సార్లు ఔట్ చేశాడు. ఇక క్రిస్ గేల్, సూర్యకుమార్ యాదవ్ లను నాలుగుసార్లు ఔట్ చేశాడు. శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లను తలో మూడు సార్లు ఔట్ చేశాడు. అయితే, ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే, సందీప్ శర్మ అత్యధికసార్లు ఔట్ చేసిన ఆటగాళ్లంతా టాప్ ఆర్డర్ లోనే ఉండడం గమనార్హం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us