Sachin Tendulkar : సచిన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సూపర్.. ఒకే ఒక్క స‌మాధానంతో ఫ్యాన్ నోరు మూయించాడుగా

క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ ఎంత గొప్ప బ్యాట్స్‌మెనో, అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఇటీవల రెడిట్ (Reddit) వేదికగా అభిమానులతో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ నిర్వహించాడు. ఈ సెషన్‌లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సచిన్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sachin Tendulkar : సచిన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సూపర్.. ఒకే ఒక్క స‌మాధానంతో ఫ్యాన్ నోరు మూయించాడుగా
Sachin Tendulkar

Updated on: Aug 25, 2025 | 8:24 PM

Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ ఎంత గొప్ప బ్యాట్స్‌మ‌నో మన అందరికీ తెలుసు. అయితే, ఆయనకు అంతే గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉందని మ‌రోసారి నిరూపించుకున్నారు. ఇటీవల సచిన్ రెడిట్‎లో ఒక ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించారు. ఆ సమయంలో ఒక అభిమాని అడిగిన ఒక విచిత్రమైన ప్ర‌శ్న‌కు మాస్టర్ బ్లాస్టర్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఫ్యాన్‌కు సచిన్ షాకింగ్ స‌మాధానం

రెడిట్‌లో ఆ ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ జ‌రుగుతున్నప్పుడు, ఒక యూజర్ సచిన్ టెండూల్కర్ అకౌంట్‌ను న‌మ్మ‌లేదు. అందుకే, “నువ్వు నిజంగా సచిన్ టెండూల్కరేనా? నమ్మకం కోసం ఒక వాయిస్ నోట్ పంపించగలవా?” అని అడిగాడు. దానికి సచిన్ ఇచ్చిన సమాధానం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. “ఇప్పుడు నా ఆధార్ కార్డు కూడా పంపించాలా?” అని సచిన్ బదులిచ్చారు. దీంతో ఆ యూజ‌ర్‌తో పాటు మిగతా అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు.

సచిన్ కెరీర్ స్పెషల్ ఇన్నింగ్స్

అదే సెష‌న్‌లో, సచిన్ త‌న కెరీర్‌లో ఎంతో ఇష్ట‌మైన ఇన్నింగ్స్ గురించి చెప్పారు. 2008లో చెన్నైలో ఇంగ్లండ్ జట్టుపై సాధించిన సెంచరీ తనకు ఎంతో ప్రత్యేకం అని చెప్పారు. ఆ మ్యాచ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో టీమిండియా గెలవడానికి 387 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. ఆ మ్యాచ్‌లో సచిన్ నాటౌట్ గా 103 పరుగులు చేసి, భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

Sachin Tendulkars

సచిన్ టెండూల్కర్ 2013 నవంబర్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 34,357 పరుగులు చేసి, 100 సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలు సాధించారు. అయినప్పటికీ, ఆయన ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో ఇండియా మాస్టర్స్ టీమ్‌కు నాయకత్వం వహించారు. సచిన్ నాయకత్వంలో ఇండియా మాస్టర్స్ ఫైనల్‌లో వెస్టిండీస్ మాస్టర్స్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..