Vasoo Paranjape: ముంబై మాజీ క్రికెటర్, ప్రముఖ కోచ్ వాసు పరంజాపే సోమవారం (ఆగస్టు 30) కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. అతను 1956, 1970 మధ్య ముంబై, బరోడా కోసం 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో అతను 23.78 సగటుతో 785 పరుగులు చేశాడు. అలాగే తొమ్మిది వికెట్లు సాధించాడు. అతను ముంబైలోని దేశీయ క్రికెట్‌లో దాదర్ యూనియన్ కోసం ఆడేవాడు. ఈ జట్టు అత్యంత శక్తివంతమైన జట్లలో ఒకటి. వాసు పరంజాపే 21 నవంబర్ 1938 న గుజరాత్‌లో జన్మించారు. జతిన్ పరాంజ్పే అతని కుమారుడు ఇతడు భారతదేశం తరపున ఆడాడు. దీనితో పాటు జతిన్ జాతీయ సెలెక్టర్‌గా కూడా వ్యవహరించారు.
ఆటగాడిగా విరమణ చేసిన తరువాత వాసు పరంజ్‌పే కోచ్‌గా మారారు. అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించడానికి చాలా మంది క్రికెటర్లకు మెలకువలు నేర్పారు. వీరిలో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు ఉన్నారు. వాసు అనేక జట్లకు కోచ్‌గా కూడా చేశారు. జాతీయ క్రికెట్ అకాడమీకి కోచ్‌గా కూడా వ్యవహరించారు. ఆయన మరణానికి రవిశాస్త్రి, వినోద్ కాంబ్లి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
శాస్త్రి ట్వీట్ చేస్తూ ‘వాసు పరాంజ్‌పే మరణం నన్ను చాలా బాధపెట్టింది. దేవుడు అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరారు’ అనిల్ కుంబ్లే ఇలా రాశాడు ‘వాసు పరంజ్‌పే మరణవార్త నన్ను కలిచివేసింది. నా కెరీర్‌లో మొదటి రెండు సంవత్సరాలు అతని మార్గదర్శకత్వంలోనే గడిపాను. ఈ సమయంలో చాలా నేర్చుకున్నాను ఆయన జీవితాంతం గుర్తుండిపోతారు’.రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘వాసు పరంజ్‌పే తన కెరీర్‌కి పెద్ద సహకారం అందించారన్నారు. తాను ఇప్పటికీ వాసు సర్ సందేశం కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు.