మనది కానిది ముట్టుకోకూడదని, దూరంగా ఉండాలని చిన్నప్పటి నుంచి బోధిస్తుంటారు. కానీ, సచిన్ టెండూల్కర్‌కు దక్కిన అవార్డు మాత్రం కచ్చితంగా అతనిదే. ఆ గిఫ్ట్‌కు అతనే యజమాని. కానీ, దాన్ని ఓపెన్ చేయకుండా నిషేధించారు. దీన్ని ఎందుకు నిషేధించారు? అసలేంటది? అని తెలుసుకోవాలని ఉందా.. ఇంకెందుకు ఆలస్యం.. అసలు మ్యాటర్‌లోకి పోదాం పదండి..
ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ చేసినందుకు సచిన్ టెండూల్కర్ బహిరంగంగా చూడలేని అవార్డును అందుకున్నాడు. ఇది సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన సమయం. అతని వయసు కూడా 18 ఏళ్ల లోపే.
అది 1990వ సంవత్సరం. సచిన్ టెండూల్కర్ మొదటి టెస్ట్ సెంచరీకి సాక్ష్యంగా ఉన్న మైదానం మాంచెస్టర్, ఇంగ్లాండ్. అప్పుడు 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న సచిన్ ఈ టెస్టు మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో 119 పరుగులు చేశాడు. అంటే భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ విధించిన 408 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఈ సెంచరీతో చేసి, మ్యాచ్‌ను డ్రా చేయడంలో కీలకపాత్ర పోషించాడు.
సచిన్ టెండూల్కర్ తన మొదటి, సాటిలేని టెస్ట్ సెంచరీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అతనికి షాంపైన్ బాటిల్ బహుమతిగా ఇచ్చారు. కానీ, అతను ఆ బాటిల్ తెరవలేకపోయాడు. ఎందుకంటే ఇంగ్లండ్‌లో షాంపైన్ బాటిల్ తెరిచి, తాగే చట్టబద్ధమైన వయస్సు 18 ఏళ్లు. కాబట్టి సచిన్‌కు ఆ అవకాశం దక్కలేదు.
అయినప్పటికీ సచిన్ ఆ షాంపైన్ బాటిల్ తెరవలేదు. దానిని జాగ్రత్తగా తీసుకుని ఇంటికి తీసుకువచ్చాడు. 8 సంవత్సరాల తర్వాత 1998లో అతని కుమార్తె సారా మొదటి పుట్టినరోజున ఓపెన్ చేశాడు.
సచిన్ టెస్టు సెంచరీల ప్రయాణం 1990లో మాంచెస్టర్‌లో మొదలై 51 సెంచరీలతో ముగిసింది. అంటే టెస్టు క్రికెట్‌లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది ఏ బ్యాట్స్‌మెన్‌కైనా పెద్ద సవాలుగా మారే రికార్డు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..