T20 Cricket: 38 బంతుల్లో 78 రన్స్‌.. 7 ఫోర్లు, 5 సిక్స్‌లు.. 200కు పైగా స్ట్రైక్‌రేట్‌తో సఫారీలకు చుక్కలు

|

Aug 05, 2022 | 5:59 AM

Ireland vs South Africa, 1st T20: ఎదురుగా 211 పరుగుల భారీ స్కోరు.. ప్రత్యర్థేమో భీకర బౌలర్లున్న ప్రొటీస్ జట్టు. అయినా అతను భయపడలేదు. పసికూన అని భావించిన బౌలర్లకు సింహస్వప్నంలా మారాడు. ఫోర్లు, సిక్స్‌లు కొడుతూ జట్టును గెలుపు అంచుల దాకా తీసుకెళ్లాడు. అతనే ఐర్లాండ్‌ వికెట్‌ కీపర్‌ లోర్కన్‌ టక్కర్‌ (Lorcan Tucker).

T20 Cricket: 38 బంతుల్లో 78 రన్స్‌.. 7 ఫోర్లు, 5 సిక్స్‌లు.. 200కు పైగా స్ట్రైక్‌రేట్‌తో సఫారీలకు చుక్కలు
Lorcan Tucker
Follow us on

Ireland vs South Africa, 1st T20: ఎదురుగా 211 పరుగుల భారీ స్కోరు.. ప్రత్యర్థేమో భీకర బౌలర్లున్న ప్రొటీస్ జట్టు. అయినా అతను భయపడలేదు. పసికూన అని భావించిన బౌలర్లకు సింహస్వప్నంలా మారాడు. ఫోర్లు, సిక్స్‌లు కొడుతూ జట్టును గెలుపు అంచుల దాకా తీసుకెళ్లాడు. అతనే ఐర్లాండ్‌ వికెట్‌ కీపర్‌ లోర్కన్‌ టక్కర్‌ (Lorcan Tucker). బుధవారం సఫారీలతో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే జట్టు పరాజయం పాలైనా లోర్కన్‌ టక్కర్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ అందరినీ ఆకట్టుకుంది. 212 పరుగుల లక్ష్య ఛేధనలో భాగంగా కేవలం 38 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అతనితో పాటు చివర్లో జార్జ్‌ డాక్‌రెల్‌ (28 బంతుల్లో 43 పరుగులు, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఒకనొక దశలో ఐర్లాండ్‌ సంచలనం సృష్టించేలా కనిపించింది. అయితే రన్‌రేట్‌ మరీ పెరిగిపోవడంతో లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

కాగా అంతకముందు మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. రేజా హెండ్రిక్స్‌(53 బంతుల్లో 74, 10 ఫోర్లు, ఒక సిక్స్‌), మర్కరమ్‌ (27 బంతుల్లో 56 పరుగులు, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించారు. ఇక లక్ష్య ఛేదనలో లోర్కెన్‌, డాక్‌రెల్‌ రాణించినా మిగతా వారెవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో పసికూనకు పరాజయం తప్పలేదు. కాగా ఈ విజయంతో 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టీ20 శుక్రవారం (ఆగస్టు 5) జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..