
ICC T20 World Cup South Africa vs India 1st innings score: ఎట్టకేలకు కింగ్ కోహ్లీ మెరిశాడు. టోర్నీ ఆసాంతం పరుగులు చేయలేక ఇబ్బంది పడుతోన్న ఈ రన్ మెషిన్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అర్ధ సెంచరీతో మెరిశాడు. మొత్తం 59 బంతుల్లో 76 పరుగులు చేసి ఔటయ్యాడు విరాట్. అతని ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కోహ్లీకి తోడు అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47, 1 ఫోర్, 4 సిక్సర్లు), శివమ్ దూబే ( 16 బంతుల్లో 27, 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (9), రిషభ్ పంత్ (0), సూర్య కుమార్ యాదవ్ (3) నిరాశ పర్చారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జ్టే తలా రెండు వికెట్లు పడగొట్టారు. జాన్సెన్, రబాడా చెరో వికెట్ తీశారు.
రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా
క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..