SA vs IND: దెబ్బకు దెబ్బ.. రెండో టెస్టులో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్‌ సమం

|

Jan 04, 2024 | 5:28 PM

టీమిండియా దెబ్బకు దెబ్బ తీసింది. మొదటి టెస్టులో చిత్తుగా ఓడించిన దక్షిణాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకుంది. కేప్ టౌన్ వేదికగా రెండు రోజుల్లోపే ముగిసిన రెండో టెస్టులో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. తద్వారా రెండు టెస్ట్‌ల సిరీస్‌ను రోహిత్ సేన సమం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో

SA vs IND: దెబ్బకు దెబ్బ.. రెండో టెస్టులో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్‌ సమం
Team India
Follow us on

టీమిండియా దెబ్బకు దెబ్బ తీసింది. మొదటి టెస్టులో చిత్తుగా ఓడించిన దక్షిణాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకుంది. కేప్ టౌన్ వేదికగా రెండు రోజుల్లోపే ముగిసిన రెండో టెస్టులో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. తద్వారా రెండు టెస్ట్‌ల సిరీస్‌ను రోహిత్ సేన సమం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా విధించిన 79 పరుగుల లక్ష్యాన్ని 3వికెట్లు కోల్పోయి ఛేదించింది రోహిత్‌ సేన. యశస్వి జైస్వాల్‌ (28), శుభమన్‌ గిల్‌ (10), విరాట్‌ కోహ్లీ (12) పరుగులు చేసి ఔట్‌ కాగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (17), శ్రేయస్‌ అయ్యర్‌ (4) మిగతా పనిని పూర్తి చేశారు. ఈ మైదానంలో భారత జట్టు టెస్ట్ మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి.  ఈ విజయంతో ధోనీ తర్వాత సఫారీ గడ్డపై సిరీస్‌ కోల్పోని రెండో కెప్టెన్‌గా రోహిత్‌ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన భారత జట్టు దక్షిణాఫ్రికాను కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేసింది.  అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 153 పరుగులకు ఆలౌటైంది.  విరాట్ కోహ్లి 46 పరుగులు, రోహిత్ శర్మ 39 పరుగులు చేశారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 98 పరుగుల ఆధిక్యం సాధించినా.. తన ఇన్నింగ్స్‌లో కూడా చెత్త రికార్డును నమోదు చేసింది రోహిత్ సేన. ఈ ఇన్నింగ్స్‌లో ఎలాంటి పరుగులు చేయకుండానే టీమ్ ఇండియా తన చివరి 6 వికెట్లను కోల్పోయింది.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఐడెన్ మార్క్రామ్ అద్భుత సెంచరీ సాధించి జట్టుకు అండగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీస్తే, రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా కూడా 6 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా సూపర్ స్పెల్  దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో  టీమ్ ఇండియాకు 79 పరుగుల స్వల్ప విజయ లక్ష్యం అవసరమైంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించారు. 23 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ ఔట్ కాగా, 10 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ కూడా, 12 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ చివరి వరకు నిలిచి టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చాడు.

కేప్ టౌన్ మైదానంలో తొలి విజయం

ఇవి కూడా చదవండి

దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌కు ఇది ఐదో టెస్టు విజయం కాగా, కేప్‌టౌన్ గడ్డపై టీమిండియా విజయం సాధించడం ఇదే తొలిసారి. గత పదేళ్లలో ఈ గడ్డపై దక్షిణాఫ్రికాకు ఇది మూడో ఓటమి.

దక్షిణాఫ్రికాలో భారత్‌  టెస్టు విజయాలు..

  • 2006 –  123 పరుగుల తేడాతో విజయం- జోహన్నెస్‌బర్గ్‌
  • 2010 – 87 పరుగుల తేడాతో విజయం- డర్బన్
  • 2018 –  63 పరుగుల తేడాతో విజయం- జోహన్నెస్‌బర్గ్‌లో
  • 2021- 113 పరుగుల తేడాతో విజయం-సెంచూరియన్
  • 2024- 7 వికెట్ల తేడాతో విజయం- కేప్ టౌన్ 

దక్షిణాఫ్రికా-భారత్ టెస్ట్ సిరీస్

  • తొలి టెస్టులో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది
  • రెండో టెస్టు- రెండు రోజుల్లోనే భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది

టీమ్ ఇండియా ప్లేయింగ్- XI:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్

దక్షిణాఫ్రికా ప్లేయింగ్- XI:

డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడాన్ మార్క్రామ్, టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ రెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, ఆండ్రీ బెర్గర్, లుంగి ఎన్‌గిడి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..