ICC World Cup 2023: ప్రపంచ కప్ 2023 ప్రారంభ దశలో భారత శిబిరం ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం కీలక ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ అనారోగ్యం. గిల్ డెంగ్యూతో బాధపడుతున్నాడు. అతను ఎప్పుడు కోలుకుంటాడో ఇప్పటి వరకు ఎలాంటి సమాచంర తెలియదు. అతను ఇప్పటికే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అతను అక్టోబర్ 14 న పాకిస్తాన్‌తో ఆడటంపై సందేహం నెలకొంది.
ఈ కారణంగా భారత్ vs ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ సందర్భంగా బుధవారం జరిగే సీనియర్ నేషనల్ సెలక్షన్ కమిటీ సమావేశంలో ప్రపంచ కప్‌లోని మిగిలిన మ్యాచ్‌లలో శుభ్‌మన్ గిల్ ఆడటంపై నిర్ణయం తీసుకోనున్నారు.
సోమవారం, BCCI శుభ్‌మాన్ గిల్‌కు సంబంధించి మెడికల్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ చెన్నైలోని వైద్య బృందం పరిశీలనలో ఉంటాడని, ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడడని తెలిపింది. ఇదిలా ఉండగా, 24 ఏళ్ల బ్యాట్స్‌మెన్ ప్లేట్‌లెట్ కౌంట్ తక్కువగా ఉందని, సోమవారం ఉదయం అతన్ని ఆసుపత్రిలో చేర్చారని సాయంత్రం నివేదికలు తెలిపాయి. అయితే, అతను ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యాడు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తల ప్రకారం, శుభమాన్ గిల్ కోలుకోవడానికి ఒక వారం కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే బ్యాకప్‌ను సిద్ధంగా ఉంచడం గురించి సెలెక్టర్లు జట్టు మేనేజ్‌మెంట్‌తో చర్చించబోతున్నారు. బ్యాకప్ ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ పేర్లు తెరపైకి వస్తున్నాయి.
ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆసియా క్రీడలు 2023లో స్వర్ణ పతకం సాధించిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. గైక్వాడ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించగా, జైస్వాల్ ఓపెనర్‌గా ఆడాడు. బ్యాకప్ అవసరాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ అర్థం చేసుకుంటే, గైక్వాడ్ లేదా జైస్వాల్ 2023 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో చోటు సంపాదించవచ్చని తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అవుటైన తర్వాత భారత జట్టులో ఇషాన్ కిషన్‌కు అవకాశం లభించింది. అయితే, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ బ్యాడ్ షాట్ ఆడి తన ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఇషాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడాలని భావిస్తున్నారు. అతని ప్రదర్శన పేలవంగా ఉంటే, పాకిస్తాన్‌పై కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను తెరవడానికి కొత్త భాగస్వామిని మనం చూడొచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..