Virat Kohli: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 112 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. అయితే రాజస్థాన్ యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఇచ్చిన క్యాచ్ పట్టుకోవడం ద్వారా విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతేకాక ముంబై మాజీ ఆటగాడు కీరన్ పోలార్డ్‌ని అధిగమించి.. ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రెండో ఆటగాడిగా అవతరించాడు. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ, పోలార్డ్ 103 క్యాచ్‌లతో రెండో స్థానంలో సమంగా కొనసాగారు. అయితే యశస్వీ క్యాచ్ పట్టడం ద్వారా కింగ్ కోహ్లీ రెండో స్థానాన్ని పూర్తిగా సొంతం చేసుకోవడమే కాక పోలార్డ్‌ని మూడో స్థానంలోకి నెట్టాడు. ఇంకా ఈ మ్యాచ్‌లో కేఎమ్ అసీఫ్ క్యాచ్‌ని కూడా కోహ్లీ అందుకోవంతో అతని ఖాతాలోకి 105 క్యాచ్‌లు చేరాయి. ఇక ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా 109 క్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
అలాగే ఐపీఎల్‌లో 100కు పైగా క్యాచ్‌లు ప్లేయర్లు ముగ్గురే కాగా అందులో.. సురేష్ రైనా(109), కింగ్ కోహ్లీ(105), కీరన్ పోలార్డ్(103) వరుస స్థానాలలో ఉన్నారు. ఇక ఈ లిస్టులో చేరేందుకు చేరువలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 98 క్యాచ్‌లతో సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే.. వందకు పైగా ఐపీఎల్ క్యాచ్‌లు పట్టిన ముగ్గురిలో కోహ్లీ మాత్రమే ఇంకా ఈ లీగ్‌లో కొనసాగుతున్నాడు.
Virat Kohli overtakes Kieron Pollard in the list of most catches as a fielder in the Indian T20 League.#ViratKohli #Pollard #sureshraina #cricket #T20 #IndianT20League #BetBarter pic.twitter.com/MJROlXLWkD
— BetBarter (@BetBarteronline) May 14, 2023
కాగా, ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 112 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బెంగళూరు తన 20 ఓవర్ల ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధన కోసం క్రీజులోకి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఘోరాతి ఘోరంగా 59 పరుగులకే అలౌట్ అయ్యారు. ఇక రాజస్థాన్ తరఫున షిమ్రాన్ హెట్‌మేర్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా.. జో రూట్ 10 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. మిగిలినవారంతా 4 కంటే తక్కువ పరుగులకే పరిమితమయ్యారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..