RR vs DC Highlights, IPL 2022: దంచి కొట్టిన మార్ష్.. రాజస్థాన్‌పై ఢిల్లీ ఘన విజయం..

| Edited By: Basha Shek

May 12, 2022 | 12:00 AM

Rajasthan Royals vs Delhi Capitals Live Score in Telugu: ప్లేఆఫ్‌ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జూలు విదిల్చింది. బుధవారం ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ (RR vs DC)లో రాజస్థాన్‌ రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

RR vs DC Highlights, IPL 2022: దంచి కొట్టిన మార్ష్..  రాజస్థాన్‌పై  ఢిల్లీ ఘన విజయం..
Rr Vs Dc Live Score Ipl 2022 Match

Rajasthan Royals vs Delhi Capitals Highlights in Telugu: ప్లేఆఫ్‌ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జూలు విదిల్చింది. బుధవారం ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ (RR vs DC)లో రాజస్థాన్‌ రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. కాగా, ఈమ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. దీంతో లక్నో టీం ముందు 161 పరుగుల టార్గెట్ ఉంది.

ఇరు జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, శ్రీకర్ భరత్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్/కీపర్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, చేతన్ సకారియా, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్/కీపర్), దేవదత్ పడిక్కల్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్

Key Events

పాయింట్ల పట్టికలో ఇరుజట్లు..

రాజస్థాన్ రాయల్స్ మూడో స్థానంలో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంలో నిలిచింది.

విజయాలు..

ఆర్ఆర్ టీం మొత్తం 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించగా, ఢిల్లీ టీం 11 గేమ్స్‌లో 5 మ్యాచ్‌ల్లో గెలిచింది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 11 May 2022 11:14 PM (IST)

    రాజస్థాన్‌ పై ఢిల్లీ ఘన విజయం..

    రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. 161 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. మిచెల్‌ మార్ష్‌ (89), వార్నర్‌ (52) రాణించారు.

  • 11 May 2022 11:05 PM (IST)

    మార్ష్‌ సెంచరీ మిస్‌..

    ఢిల్లీ జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. మిషెల్‌ మార్ష్‌ (89)ని చాహల్ బోల్తా కొట్టించాడు. ఢిల్లీ విజయానికి ఇంకా 17 బంతుల్లో 17 పరుగులు అవసరం.


  • 11 May 2022 10:49 PM (IST)

    సెంచరీ దాటిన భాగస్వామం..

    మార్ష్‌, వార్నర్‌ లు ధాటిగా ఆడుతున్నారు. కేవలం 85 బంతుల్లో 105 పరుగుల జోడించి ఢిల్లీని విజయం వైపు తీసుకెళుతున్నారు. ఆ జట్టు విజయానికి ఇంకా 36 బంతుల్లో 56 పరుగులు అవసరం.

  • 11 May 2022 10:28 PM (IST)

    మార్ష్‌ అర్థ సెంచరీ..

    మిచెల్‌ మార్ష్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 39 బంతుల్లో 5 సిక్స్‌లు, 2 ఫోర్ల సహాయంతో ఈ మార్క్‌ను చేరుకున్నాడు. అతనికి తోడుగా వార్నర్‌ (24) క్రీజులో ఉన్నాడు. ఢిల్లీ విజయానికి ఇంకా 56 బంతుల్లో 79 పరుగులు అవసరం.

  • 11 May 2022 10:17 PM (IST)

    50 దాటిన ఢిల్లీ స్కోరు..

    ఢిల్లీ స్కోరు 50 పరుగులు దాటింది. మిచెల్‌ మార్ష్‌ (30 బంతుల్లో 41) ధాటిగా ఆడతుండగా.. వార్నర్‌ 19 నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ స్కోరు 8.2 ఓవర్లు ముగిసే సరిఇక 63/1.

  • 11 May 2022 09:50 PM (IST)

    3 ఓవర్లకు ఢిల్లీ స్కోర్..

    3 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ కోల్పోయి 5 పరుగులు చేసింది. వార్నర్ 2, మిచెల్ మార్ష్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 11 May 2022 09:38 PM (IST)

    తొలి వికెట్ డౌన్..

    ఛేజింగ్‌ మొదలుపెట్టిన ఢిల్లీ టీంకు ఆదిలోనే షాక్ తగిలింది. శ్రీకర్ భరత్(0) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 11 May 2022 09:21 PM (IST)

    ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

    ఐపీఎల్ 2022లో భాగంగా నేడు 58వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం, ముంబైలో జరుగుతోంది. కాగా, ఈమ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. దీంతో లక్నో టీం ముందు 161 పరుగుల టార్గెట్ ఉంది.

  • 11 May 2022 09:12 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్..

    రాజస్థాన్ రాయల్స్ టీం పడిక్కల్ (48) రూపంలో ఆరో వికెట్‌ను కోల్పోయింది. నార్ట్జే బౌలింగ్‌లో నగర్ కోటికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 18.1 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ టీం 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.

  • 11 May 2022 09:08 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్..

    రాజస్థాన్ రాయల్స్ టీం రియాన్ పరాగ్ (9) రూపంలో ఐదో వికెట్‌ను కోల్పోయింది. చేతన్ సకారియా బౌలింగ్‌లో పొవెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 17.5 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ టీం 5 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది.

  • 11 May 2022 08:57 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్..

    రాజస్థాన్ రాయల్స్ టీం సంజు శాంసన్ (6) రూపంలో నాలుగో వికెట్‌ను కోల్పోయింది. నార్ట్జే బౌలింగ్‌లో శార్దుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 16.1 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ టీం 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది.

  • 11 May 2022 08:47 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్..

    రాజస్థాన్ రాయల్స్ టీం రవి చంద్రన్ అశ్విన్(50) రూపంలో మూడో వికెట్‌ను కోల్పోయింది. మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 14.1 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ టీం 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది.

  • 11 May 2022 08:45 PM (IST)

    హఫ్ సెంచరీ పూర్తి చేసిన అశ్విన్..

    రవిచంద్రన్ అశ్విన్ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో కేవలం 37 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం 14 ఓవర్లు పూర్తయ్యే సరికి 2 వికెట్లు కోల్పోయి107 పరుగులు చేసింది.

  • 11 May 2022 08:32 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్..

    రాజస్థాన్ రాయల్స్ టీమ్ రెండో వికెట్‌ను కోల్పోయింది. యశశ్వి జైస్వాల్‌ను మిచెల్ మార్ష్ ఔట్ చేశాడు. 19 బంతులాడిన యశశ్వి.. ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 19 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ టీమ్ స్కోర్ ప్రస్తుతం 11 ఓవర్లకు 73/2గా ఉంది.

  • 11 May 2022 07:56 PM (IST)

    5 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్..

    5 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ రాయల్స్ టీం 1 వికెట్ కోల్పోయి 32 పరుగులు చేసింది. అశ్విన్ 10, జైస్వాల్ 13 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా ఒక వికెట్ పడగొట్టాడు.

  • 11 May 2022 07:46 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్..

    రాజస్థాన్ రాయల్స్ టీం బట్లర్(7) రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. చేతన్ సకారియా బౌలింగ్‌లో శార్దుల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 3 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ టీం ఒక వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది.

  • 11 May 2022 07:06 PM (IST)

    RR vs DC Live Score, IPL 2022: రాజస్థాన్ రాయల్స్ జట్టు

    రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్/కీపర్), దేవదత్ పడిక్కల్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్

  • 11 May 2022 07:05 PM (IST)

    RR vs DC Live Score, IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు

    ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, శ్రీకర్ భరత్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్/కీపర్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, చేతన్ సకారియా, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే

  • 11 May 2022 07:03 PM (IST)

    RR vs DC Live Score, IPL 2022: టాస్ గెలిచిన ఢిల్లీ..

    ఢిల్లీ క్యాపిటల్స్ టీం టాస్ గెలిచి, ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.

  • 11 May 2022 06:48 PM (IST)

    RR vs DC Live Score, IPL 2022: టాప్ 4లో ఢిల్లీ చేరేనా..

    పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ టీం ఈ మ్యాచ్‌లో గెలిచి, ప్లే ఆఫ్స్ బరిలో మరింత పైచేయి సాధించాలని కోరుకుంటోంది. అలాగే ఐదో స్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం టాప్ 4లోకి చేరుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. దీంతో నేటి పోరు ఎంతో ఆసక్తికరంగా సాగనుంది.

  • 11 May 2022 06:47 PM (IST)

    RR vs DC Live Score, IPL 2022: రాజస్థాన్‌తో ఢిల్లీ పోరు..

    ఐపీఎల్ 2022లో భాగంగా నేడు 58వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం, ముంబైలో జరుగుతోంది.

Follow us on