Video: 0,W,6,0,0,W.. ఛీ కొట్టిన చెన్నైకు ఒకే ఓవర్లో ఇచ్చిపడేసిన జడేజా

Ravindra Jadeja: 12 సీజన్లపాటు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన రవీంద్ర జడేజా.. ఈ సీజన్‌లో తన మాతృ జట్టు అయిన రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగాడు. అయితే, ఛీ కొట్టిన చెన్నైకు తన తొలి ఓవర్ లోనే దిమ్మతిరిగే షాకిచ్చాడు ఆ ఆల్ రౌండర్.

Video: 0,W,6,0,0,W.. ఛీ కొట్టిన చెన్నైకు ఒకే ఓవర్లో ఇచ్చిపడేసిన జడేజా
Rr Vs Csk Jadeja

Updated on: Mar 30, 2026 | 9:14 PM

2012లో చెన్నై(CSK)లో చేరి, ఆ జట్టుకు 12 సీజన్లు ఆడిన రవీంద్ర జడేజా.. ఈ సీజన్‌లో తన మాతృ జట్టు అయిన రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. నిజానికి, ఈ ఏడాది జరిగిన మినీ వేలానికి ముందే చెన్నై టీం రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేసింది. జడేజాకు బదులుగా, అప్పటికే రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్న సంజు సామ్సన్‌ను చెన్నై జట్టులోకి తీసుకుంది.

ట్రేడ్ ద్వారా రాజస్థాన్‌లో చేరిన జడేజా.. ఈ లీగ్‌లో తన తొలి మ్యాచ్‌లోనే సీఎస్‌కేపై అద్భుతంగా రాణించాడు. జట్టును మూడుసార్లు ఛాంపియన్‌గా నిలపడానికి కష్టపడిన తర్వాత తనను వదిలేసిన సీఎస్‌కేపై ప్రతీకారం తీర్చుకున్న జడేజా.. సీఎస్‌కేతో జరిగిన తన తొలి మ్యాచ్‌లోనే తొలి ఓవర్‌లోనే రెండు కీలక వికెట్లు తీసి ధీటుగా సమాధానమిచ్చాడు.

చెన్నై ఇన్నింగ్స్‌లో 8వ ఓవర్ వేయడానికి వచ్చిన జడేజా, అదే ఓవర్‌లోని రెండో బంతికి సర్ఫరాజ్ ఖాన్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. సర్ఫరాజ్ వికెట్ పడిన తర్వాత వచ్చిన శివమ్ దూబే, వెంటనే జడేజా బంతిని సిక్సర్‌గా కొట్టాడు. సిక్సర్ కొట్టిన దూబే, క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంటే, జడేజా తాను వేసిన మొదటి ఓవర్‌లోనే రెండు కీలక వికెట్లు పడగొట్టి చెన్నైకు దిమ్మతిరిగే షాకిచ్చాడు.

Follow Us