IPL: ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుంది’.. వచ్చే ఐపీఎల్‌కు కోహ్లీ టీం నుంచి ఆ ముగ్గురు ఔట్.!

ఐపీఎల్ 2023లో ఫైనల్‌ వరకు చేరుతుందనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి పేలవ ప్రదర్శనతో అభిమానులకు నిరాశ మిగిల్చింది..

IPL: చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుంది.. వచ్చే ఐపీఎల్‌కు కోహ్లీ టీం నుంచి ఆ ముగ్గురు ఔట్.!
RCB Captain

Updated on: Jun 19, 2023 | 10:00 AM

ఐపీఎల్ 2023లో ఫైనల్‌ వరకు చేరుతుందనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి పేలవ ప్రదర్శనతో అభిమానులకు నిరాశ మిగిల్చింది. కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరకుండా.. లీగ్ స్టేజిలోనే ఇంటి ముఖం పట్టింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్ లాంటి సీనియర్ ఆటగాళ్లు అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నప్పటికీ.. బౌలర్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబరచలేకపోయారు. సిరాజ్ యార్కర్లతో ప్రత్యర్ధులను భయపెట్టినా.. కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన సంగతి తెలిసిందే.

మొత్తానికి 14 మ్యాచ్‌ల్లో కేవలం ఏడింటిలోనే గెలిచి.. ఆరో స్థానంతో సరిపెట్టుకుంది ఆర్సీబీ. దీంతో ఐపీఎల్ 2024కి ముందుగా జట్టు ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది రాయల్ ఛాలెంజర్స్ యాజమాన్యం. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న మినీ వేలానికి ముందుగా వదులుకునే ఆటగాళ్ల జాబితాను పక్కా ప్రణాళికతో సిద్దం చేస్తోంది. ముఖ్యంగా పేలవ ప్రదర్శన కనబరిచిన ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో పాటు దినేష్ కార్తీక్, దేశీయ అన్‌క్యాప్ద్ ప్లేయర్స్‌లో కొంతమందిని ఆర్సీబీ వదులుకోనుందని తెలుస్తోంది. కాగా, ముగ్గురు విదేశీ ఆటగాళ్ల పేర్లలో హసరంగా(రూ. 10.75 కోట్లు), జోష్ హజెల్‌వుడ్(రూ. 7.75 కోట్లు), ఫిన్ అలెన్(రూ. 80 లక్షలు) ఉన్నట్లు సమాచారం.