Rohit Sharma: గిల్‌ క్లాసీ పుల్‌ షాట్‌కు.. గాడ్‌ ఆఫ్‌ పుల్‌ షాట్‌ రోహిత్‌ శర్మ ఎక్స్‌ప్రెషన్‌ చూడండి! వీడియో

టీమిండియా బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వేటను ప్రారంభించింది. శుభ్‌మన్ గిల్ సెంచరీతో అదరగొట్టాడు. అతని అద్భుతమైన పుల్ షాట్‌కు రోహిత్ శర్మ ఫిదా అయ్యాడు. ఈ మ్యాచ్‌లో గిల్ సూపర్ పెర్ఫామెన్స్, రోహిత్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Rohit Sharma: గిల్‌ క్లాసీ పుల్‌ షాట్‌కు.. గాడ్‌ ఆఫ్‌ పుల్‌ షాట్‌ రోహిత్‌ శర్మ ఎక్స్‌ప్రెషన్‌ చూడండి! వీడియో
Rohit Sharma Shubman Gill

Updated on: Feb 21, 2025 | 1:48 PM

విజయంతో టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 వేటను మొదలుపెట్టింది. గురువారం దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయంతో టీమిండియా ఫుల్‌ జోష్‌లోకి వచ్చింది. 23న పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో మరింత రెట్టించిన ఉత్సాహంతో రోహిత్‌ సేన బరిలోకి దిగనుంది. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ప్రిన్స్‌ శుబ్‌మన్‌ గిల్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి 229 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గిల్‌ ఒక్కడే సగం టార్గెట్‌ కొట్టేశాడు.

ఒక వైపు వికెట్లు పడుతున్నా.. ఒక్కడా ఏకాగ్రత కోల్పోకుండా చివరి వరకు క్రీజ్‌లో నిలబడి సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే గిల్‌ ఆడిన ఈ ఇన్నింగ్స్‌లో ఓ స్పెషల్‌ షాట్‌ గురించి మాట్లాడుకోవాలి. బంగ్లాదేశ్‌ బౌలర్‌ తంజిమ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ నాలుగో బంతికి గిల్‌ ఓ అద్భుతమైన పుల్‌ షాట్‌ ఆడాడు. అది ఎంత సూపర్‌గా ఉందంటే.. నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో నిల్చున్న రోహిత్‌ శర్మ ఆ షాట్‌కు ఫిదా అయిపోయాడు. తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్‌తో గిల్‌ను అభినందించాడు. సాధారణంగా ఏ ప్లేయర్‌ మంచి షాట్‌ ఆడినా మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ అభినందిస్తూ ఉంటారు.

ఇది కూడా చదవండి: నిన్నటి మ్యాచ్‌లో ఇది గమనించారా? బంగ్లా ప్లేయర్‌ కష్టానికి కరిగిపోయిన రోహిత్‌, షమీ! ఇంత మంచోళ్లేంటయ్యా మీరు..

కానీ, ప్రపంచ క్రికెట్‌లో పుల్‌ షాట్‌ అంటేనే టక్కున గుర్తుకు వచ్చే పేరు రోహిత్‌ శర్మ. చాలా మంది ప్లేయర్లు పుల్‌ షాట్‌ను బాగా ఆడినప్పటికీ.. ఎందుకో రోహిత్‌ శర్మ పుల్‌ షాట్‌ కొడితే చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. చాలా సింపుల్‌గా బాల్‌ను గ్రౌండ్‌ బయటికి కొట్టేస్తాడు. అందుకే రోహిత్‌ శర్మ అభిమానులు అతన్ని గాడ్‌ ఆఫ్‌ పుల్‌ షాట్‌ అని ముద్దగా పిల్చుకుంటూ ఉంటారు. అయితే అలాంటి రోహిత్‌ శర్మను ఎదురుగా పెట్టుకొని, అతనే మెచ్చుకునేలా పుల్‌ షాట్‌ కొట్టడంతో ఇక్కడ గిల్‌ మార్కులు కొట్టేశాడు. బంగ్లాతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత గిల్‌ కొట్టిన ఆ పుల్‌ షాట్‌ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందుకే రోహిత్‌ శర్మ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ అయితే నెక్ట్స్‌ లెవెల్‌ అని చెప్పాలి. రోహిత్‌ ఇచ్చిన ఒక్క ఎక్స్‌ప్రెషన్‌ ఆ షాట్‌ ఎంత అద్భుతంగా ఉందో చెప్పేస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.