
టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నీ కచ్చితంగా ఆడాలని క్రికెట్ అభిమానులంతా కోరుకుంటున్నారు. వాళ్లకు కూడా ఆ టోర్నీ ఆడాలనే ఉంది. అందుకోసమే టీ20, టెస్టు ఫార్మాట్‌లకు కూడా రిటైర్మెంట్ ఇచ్చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితితో వన్డే వరల్డ్ కప్ ఆడాలనే ఆశలపై నీళ్లు పడేలానే కనిపిస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌తో ప్రారంభమైన మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ బరిలోకి దిగడంపై క్రికెట్ అభిమానులు మస్తు హ్యాపీ అయ్యారు. తనకు బాగా అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్‌లో రోహిత్ దుమ్మురేపుతాడని సంబరపడ్డారు.
కానీ, వారి సంతోషాన్ని ఆవిరి చేస్తూ రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు. 16 బంతులు ఎదుర్కొని 16 పరుగులు మాత్రమే చేసి దురదృష్టవశాత్తు రన్ అవుట్ అయ్యాడు. గిల్ వల్లే అవుట్ అయ్యాడని కొందరు, ఫీల్డర్ అడ్డొచ్చి గిల్ రాలేకపోయాడని మరికొందరు, రోహితే లేని పరుగు కోసం వచ్చి అవుట్ అయ్యడని ఇంకొందరు చెబుతున్నప్పటికీ.. రోహిత్ శర్మ తక్కువ స్కోర్‌కే అవుట్ కావడం మాత్రం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి గిల్‌కు ఆఫ్ఘాన్ ప్లేయర్ అడ్డు రాకుండా ఉంటే.. రన్ కోసం గిల్ వెళ్లేవాడని చాలా మంది క్రికెట్ అభిమానులు అంటున్నారు. సో.. ఇక్కడ రోహిత్, గిల్.. ఇద్దరిది కూడా తప్పు కాదు.
కాగా రోహిత్ 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో మంచి ఊపుమీద ఉన్నప్పుడు ఇలా రన్ అవుట్ అవ్వడం మాత్రం అందరినీ చాలా నిరాశకు గురి చేసింది. అయితే రోహిత్ శర్మ బ్యాడ్ లక్‌గా అవుట్ అయినప్పటికీ అక్కడుంది గంభీర్ అని కొంతమంది అభిమానులు అంటున్నారు. టీమ్‌కు కాస్త భారం అని అనిపించినా.. ఎంత పెద్ద ప్లేయర్‌నైనా ఇంటికి పంపే మొండిఘటం గంభీర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పైగా రోహిత్ శర్మకు ఫిట్నెస్ సమస్యలు కూడా ఉన్నాయి. దీనికి తోడు ఇలా రన్స్ చేయకుండా ఉంటే.. వరల్డ్ కప్ కోసం రోహిత్‌ను కన్సిడర్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా టీమ్‌లో ప్లేస్ కోసం యంగ్ ప్లేయర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. వాళ్లు ఇరగదీస్తుంటే.. ఎంతకాలం అని సీనియర్లను పట్టుకొని వేలాడతారంటూ విమర్శలు కూడా మొదలయ్యే ప్రమాదం లేకపోలేదు. అసలే టీమ్‌లో స్టార్ కల్చర్‌ను లేకుండా చేయాలనే సంకల్పంతో ఉన్న గంభీర్.. చిన్న పాయింట్ దొరికినా చాలు.. తాను అనుకున్నది చేసేస్తాడు. మరి మిగిలిని రెండు వన్డేల్లోనైనా రోహిత్ శర్మ తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడతాడని ఆశిద్దాం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి