‘హిట్ మ్యాన్’ కాస్తా.. ‘యాంగ్రీ మ్యాన్’ అయ్యాడు

మాంచెస్టర్‌:వరల్డ్ కప్‌లో అంపైర్ల తప్పిదాలపై ఫ్యాన్స్ గరంగరం అవుతున్నారు. ధోని గ్లొవ్స్‌పై పెట్టిన శ్రద్ద అంపైర్ల సెలక్షన్స్‌పై కూడా పెట్టమని గతంలో ఫ్యాన్స్ ఐసీసీకి హితబోధ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి భారత్, వెస్టిండీస్ మధ్య మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌లో రోహిత్‌ క్యాచ్‌ ఔట్‌ వివాదాస్పదమైంది. రోచ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేయగా బంతి బ్యాట్‌కు, ప్యాడ్‌కు మధ్యలో వెళ్లి వికెట్‌ కీపర్‌ చేతుల్లో పడింది. బంతికి రెండిట్లో ఏదో ఒకటి తాకిన […]

'హిట్ మ్యాన్' కాస్తా.. 'యాంగ్రీ మ్యాన్' అయ్యాడు
Follow us

|

Updated on: Jun 29, 2019 | 12:10 AM

మాంచెస్టర్‌:వరల్డ్ కప్‌లో అంపైర్ల తప్పిదాలపై ఫ్యాన్స్ గరంగరం అవుతున్నారు. ధోని గ్లొవ్స్‌పై పెట్టిన శ్రద్ద అంపైర్ల సెలక్షన్స్‌పై కూడా పెట్టమని గతంలో ఫ్యాన్స్ ఐసీసీకి హితబోధ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి భారత్, వెస్టిండీస్ మధ్య మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌లో రోహిత్‌ క్యాచ్‌ ఔట్‌ వివాదాస్పదమైంది. రోచ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేయగా బంతి బ్యాట్‌కు, ప్యాడ్‌కు మధ్యలో వెళ్లి వికెట్‌ కీపర్‌ చేతుల్లో పడింది. బంతికి రెండిట్లో ఏదో ఒకటి తాకిన శబ్దం వచ్చింది కానీ.. అది ప్యాడ్‌గా భావించి అంపైర్‌ ఔటివ్వలేదు. వెస్టిండీస్‌ రివ్యూకి వెళ్లింది. రీప్లేలో బంతి బ్యాట్‌కే తాకినట్లు స్పష్టమైన ఆధారం ఏమీ లభించలేదు. స్నికో మీటర్‌ను ఉపయోగించకుండానే బంతి బ్యాట్‌కు తాకినట్లు నిర్ధరించుకున్న థర్డ్ అంపైర్‌ ఔటిచ్చేశాడు. గ్రౌండ్‌లో స్క్రీన్‌పై రీప్లే చూసిన వాళ్లందరూ అవాక్కయ్యారు. రోహిత్‌ తీవ్ర అసంతృప్తితో పెవిలియన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.

తన అసంతృప్తిని రోహిత్‌ శర్మ చాలా సింపుల్‌గా, ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా వ్యక్తపరిచాడు.  అతను ఆడిన చివరి బంతి బ్యాటుకు దూరంగా వెళ్తున్న ఇమేజ్‌ను పెద్దది చేసి రోహిత్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. దానికింద చేతితో నదురును కొట్టుకుంటున్న ఎమోజీని ఉంచాడు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్‌ 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.