
భారత క్రికెట్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఒక అంశం గురించి వచ్చిన వార్త ఇప్పుడు చర్చనీయాంశమైంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ‘నెట్స్’లో ప్రాక్టీస్‌కి దూరంగా ఉన్న సమయంలో, రోహిత్ శర్మకు రీప్లేస్‌మెంట్‌గా భావిస్తున్న యువ ఆటగాడితో సుదీర్ఘంగా మాట్లాడారని ఒక నివేదిక వెల్లడించింది.
తాజా నివేదిక ప్రకారం, భారత జట్టు నెట్ ప్రాక్టీస్‌లో ఉన్నప్పుడు రోహిత్ శర్మ కొంత సమయం పాటు బ్యాటింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ముఖ్య సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లు యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్‌తో చాలా సేపు మాట్లాడారంట.
వచ్చే మ్యాచ్‌ల కోసం జట్టు ప్రణాళికలు, వ్యూహాల గురించి ఈ చర్చ జరిగి ఉండొచ్చని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ముఖ్యంగా వన్డే కెప్టెన్సీ మార్పు తర్వాత రోహిత్ శర్మ, గంభీర్‌ల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో, రోహిత్ నెట్స్‌కు దూరంగా ఉన్న సమయంలో, అతని స్థానంలో పోటీ పడుతున్నట్లు భావిస్తున్న జైస్వాల్‌తో గంభీర్ సుదీర్ఘంగా మాట్లాడడం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మకు సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ, శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ అప్పగించిన తర్వాత జట్టులో రోహిత్ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే, యువ, దూకుడు బ్యాటర్ అయిన యశస్వి జైస్వాల్ వన్డే జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం రోహిత్‌తో పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లు యశస్వి జైస్వాల్‌కు ఇస్తున్న ప్రాధాన్యత, అతనితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్న తీరు, జట్టులో మార్పులకు సంకేతంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ ఆటగాళ్లకు, కొత్త కోచ్‌గా వచ్చిన గంభీర్‌కు మధ్య ఉన్న సంబంధాలు, కెప్టెన్సీ మార్పు నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు భారత క్రికెట్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ పరిణామాలు రాబోయే మ్యాచ్‌లలో తుది జట్టు ఎంపికలో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో చూడాలి. అయితే, ప్రస్తుతం రోహిత్ నెట్స్‌కు దూరంగా ఉండటం, గంభీర్ యువ ఆటగాడికి అధిక సమయం కేటాయించడం వంటి అంశాలు టీమిండియాలో సీనియర్ ఆటగాళ్ల పాత్రపై మేనేజ్‌మెంట్ వైఖరిని తెలియజేస్తున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..