AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: రోహిత్ శర్మపై మండిపడుతున్న కోహ్లీ అభిమానులు.. అసత్య ప్రచారం చేస్తున్నారంటూ వివాదం

Rohit Sharma: రోహిత్ శర్మ కొత్త టీవీ షో ప్రోమోలో చెప్పిన పాత జ్ఞాపకం సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది. స్టీవ్ స్మిత్‌తో జరిగిన ఘటనపై రోహిత్ చేసిన వ్యాఖ్యలను కోహ్లీ అభిమానులు తప్పుబడుతున్నారు. పాత వీడియోలను షేర్ చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సెప్టెంబర్ 19 నుంచి షో ప్రసారం కానుండటంతో ఈ వివాదం మరింత ఆసక్తి రేపుతోంది.

Rohit Sharma: రోహిత్ శర్మపై మండిపడుతున్న కోహ్లీ అభిమానులు.. అసత్య ప్రచారం చేస్తున్నారంటూ వివాదం
Virat Kohli
Rakesh
|

Updated on: Sep 12, 2026 | 10:30 AM

Share

Rohit Sharma: భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా నిరంతరం ఏదో ఒక పోరు నడుస్తూనే ఉంటుంది. అయితే తాజాగా రోహిత్ శర్మ కొత్తగా ప్రారంభించబోతున్న ఒక టీవీ షో ప్రోమో ఆ వివాదాన్ని మరింత రాజేసింది. రోహిత్ చెప్పిన ఒక పాత జ్ఞాపకంపై కోహ్లీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ త్వరలోనే బుల్లితెరపై కొత్త అవతారంలో అలరించేందుకు సిద్ధమయ్యారు. సోనీ టీవీలో ప్రసారం కానున్న ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ అనే గేమింగ్ షో ద్వారా ఆయన ప్రేక్షకులను పలకరించనున్నారు. మనీష్ పాల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ప్రోమోలో, రోహిత్ తన పాత జ్ఞాపకాలను పంచుకుంటూ కనిపించారు. సెప్టెంబర్ 19 నుంచి ప్రసారం కానున్న ఈ ప్రోమో ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది.

ప్రోమోలో రోహిత్ చెప్పిన ఆ పాత జ్ఞాపకం ఏమిటి?

ఈ ప్రోమోలో మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, యాంకర్ మనీష్ పాల్‌లతో కలిసి రోహిత్ శర్మ మాట్లాడారు. 2014-15 ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సమయంలో జరిగిన ఒక సంఘటనను రోహిత్ గుర్తుచేసుకున్నారు. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌తో తనకు మైదానంలో గొడవ జరిగినప్పుడు, శిఖర్ ధావన్ తన తరఫున నిలబడి ఆస్ట్రేలియా ఆటగాళ్లకు గట్టిగా సమాధానం ఇచ్చాడని రోహిత్ పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కాగానే వివాదం మొదలైంది.

వీడియో ఆధారాలతో కోహ్లీ ఫ్యాన్స్ ఎదురుదాడి

రోహిత్ శర్మ చెప్పిన ఈ పాత కథనం పూర్తిగా అసత్యమని విరాట్ కోహ్లీ అభిమానులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఆ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్‌తో గొడవపడింది రోహిత్ కాదని, విరాట్ కోహ్లీ అని వారు స్పష్టం చేస్తున్నారు. నాటి సంఘటనకు సంబంధించిన పాత వీడియో క్లిప్‌లను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, రోహిత్ శర్మ నేషనల్ టీవీలో అబద్ధాలు చెప్తున్నారంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాదం రోజురోజుకూ ముదిరి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.

సెప్టెంబర్ 19న ప్రసారం కానున్న షో

తొలి ప్రోమోతోనే ఈ స్థాయిలో రచ్చ మొదలవ్వడంతో ఈ షోపై అందరి దృష్టి పడింది. రోహిత్ శర్మ నిజంగా ఏ సందర్భంలో ఆ మాటలు అన్నారో లేదా పూర్తి ఎపిసోడ్‌లో ఎలాంటి స్పష్టత ఇస్తారో చూడాల్సి ఉంది. మొదటి వీడియోతోనే షోపై విపరీతమైన హైప్ పెరగడమే కాకుండా క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చ నడుస్తోంది. క్రీడాకారుల పాత జ్ఞాపకాలు కొన్నిసార్లు మైదానం బయట పెద్ద వివాదాలకు దారితీస్తుంటాయి. ఈ ప్రోమో రచ్చతో రాబోయే రోజుల్లో రోహిత్ శర్మ టీవీ షో ఎలాంటి స్పందనను మూటగట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us