IND vs AFG: రీఎంట్రీలో సున్నాకే రనౌట్‌.. గ్రౌండ్‌లోనే గిల్‌పై విరుచుకుపడిన రోహిత్‌.. వీడియో

|

Jan 12, 2024 | 12:18 PM

ఈ మ్యాచ్‌తో చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ టీ20లకు కెప్టెన్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో రోహిత్ రనౌట్‌ అయ్యాడు. కేవలం రెండు బంతులను ఎదుర్కొన్న హిట్‌మ్యాన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఇక్కడ శుభ్‌మన్‌ గిల్‌ పొరపాటు కూడా ఉంది. రన్‌కు వస్తోన్న రోహిత్‌ను గమనించకుండా క్రీజులోనే నిలబడిపోయాడు గిల్‌.

IND vs AFG: రీఎంట్రీలో సున్నాకే రనౌట్‌.. గ్రౌండ్‌లోనే గిల్‌పై విరుచుకుపడిన రోహిత్‌.. వీడియో
Rohit Sharma, Shubman Gill
Follow us on

తీవ్ర ఉత్కంఠ రేపిన భారత్ -ఆఫ్ఘనిస్థాన్ తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో గురువారం (జనవరి 11) జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాగా ఈ మ్యాచ్‌తో చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ టీ20లకు కెప్టెన్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో రోహిత్ రనౌట్‌ అయ్యాడు. కేవలం రెండు బంతులను ఎదుర్కొన్న హిట్‌మ్యాన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఇక్కడ శుభ్‌మన్‌ గిల్‌ పొరపాటు కూడా ఉంది. రన్‌కు వస్తోన్న రోహిత్‌ను గమనించకుండా క్రీజులోనే నిలబడిపోయాడు గిల్‌. ఇద్దరూ నాన్‌స్ట్రైకర్స్‌ ఎండ్‌లోనే ఉండిపోయాడు. దీంతో రోహిత్‌ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.అఫ్ఘానిస్థాన్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా ఓపెనింగ్ జోడీగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ ఓపెనర్‌గా రావాల్సి ఉండగా గాయం కారణంగా తప్పుకున్నాడు. దీంతో గిల్‌కి ఓపెనర్‌ అవకాశం లభించింది. అయితే భారత్ ఇన్నింగ్స్ రెండో బంతికి గిల్ చేసిన తప్పిదం వల్ల కెప్టెన్‌ రోహిత్‌ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.

ఇన్నింగ్స్ రెండో బంతికి రోహిత్ శర్మ ఒక అడుగు ముందుకు వేసి పరుగు కోసం బంతిని మిడ్ ఆఫ్ వైపు షాట్‌ ఆడాడు. అయితే మిడ్ ఆఫ్ ఫీల్డర్ డైవ్‌ చేస్తూ బంతిని ఆపేశాడు. రోహిత్ పరుగు కోసం గిల్‌ను పిలిచాడు. అయితే గిల్‌ మాత్రం బంతినే చూస్తూ క్రీజులో తచ్చాడాడు. వెనకకు ముందూ అడుగులేస్తూ అక్కడే ఉండిపోయాడు.. దీంతో క్రీజులోకి రాకుండానే రోహిత్ రనౌట్ అయ్యాడు. దీంతో కోపోద్రిక్తుడైన రోహిత్ అందరి ముందు శుభ్‌మాన్‌పై విరుచుకుపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్‌ రనౌట్‌ తర్వాత గిల్‌ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 12 బంతుల్లో 23 పరుగులు చేసి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అయితే మ్యాచ్‌ అనంతరం గిల్‌ను తిట్టడంపై స్పందించాడు రోహిత్‌. ఆటలో ఇవన్నీ సహజమేనని, కుర్రాళ్లు బాగా ఆడాడాని ప్రశంసలు కురిపించాడు.

ఇవి కూడా చదవండి

గిల్ పై రోహిత్ శర్మ ఆగ్రహం..

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..