అమ్మాయిలతో జాగ్రత్త.. ఆ ఇద్దరిలా అస్సలు మారొద్దు.. వైభవ్ సూర్యవంశీకి మాజీ క్రికెటర్ హెచ్చరిక..!

Robin Uthappa Warning to Vaibhav Suryavanshi: ఉతప్ప చేసిన వ్యాఖ్యలు కేవలం వైభవ్‌కే కాక, దేశంలోని ప్రతి వర్ధమాన క్రీడాకారుడికి ఒక కనివిప్పు లాంటివి. ఈ చిన్నారి సంచలనం తన ప్రతిభను కాపాడుకుంటూ, తప్పుల దారిన పడకుండా క్రమశిక్షణతో ముందడుగు వేస్తే భారత క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త శకం మొదలవడం ఖాయం.

అమ్మాయిలతో జాగ్రత్త.. ఆ ఇద్దరిలా అస్సలు మారొద్దు.. వైభవ్ సూర్యవంశీకి మాజీ క్రికెటర్ హెచ్చరిక..!
Robin Uthappa Warning To Vaibhav Suryavanshi

Updated on: Aug 06, 2026 | 8:00 AM

Robin Uthappa Warning to Vaibhav Suryavanshi: క్రికెట్ ప్రపంచంలో సరికొత్త సంచలనంగా మారిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అత్యంత కీలకమైన హెచ్చరిక చేశారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు అమ్మాయిల వ్యామోహంలో పడి, సోషల్ మీడియా మాయలో చిక్కుకుంటే ఎలాంటి వినాశనం జరుగుతుందో చెబుతూ ఉతప్ప చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభతో బ్యాట్ పట్టి ఐపీఎల్ వేలం నుంచి మైదానం వరకు రికార్డుల వేట సాగిస్తున్న బిహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు దేశమంతటా మారుమోగుతోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడు చూపిస్తున్న షాట్ల శ్రేణి, శతాబ్దాల రికార్డులను తిరగరాసే పట్టుదల చూసి దిగ్గజాలే ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ యంగ్ సెన్సేషన్ భవిష్యత్తుపై టీమిండియా మాజీ ఓపెనర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర, అత్యంత హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఇదికూడా చదవండి: స్వ్కాడ్‌లో ఈ 15మంది ఉంటే చాలు.. వద్దన్నా 2027 వన్డే వరల్డ్ కప్ పట్టుకొచ్చేస్తారంతే..!

రాబోయే ఐదేళ్లే అసలైన అగ్నిపరీక్ష..

వైభవ్ కెరీర్ ఏ దిశగా సాగుతుందనేది రాబోయే ఐదేళ్ల కాలంపైనే ఆధారపడి ఉంటుందని ఉతప్ప అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అతడికి 15 ఏళ్లు మాత్రమే ఉన్నాయని, 20 ఏళ్లు వచ్చే వరకు ఆటపై పూర్తి దృష్టి కేంద్రీకరించడమే అతడి ముందున్న అతిపెద్ద పరీక్ష అని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

సాధారణంగా 18 ఏళ్ల వయసు దాటాక యువ ఆటగాళ్లకు అమ్మాయిల నుంచి అటెన్షన్ విపరీతంగా పెరుగుతుందని తెలిపారు. ఆ ఆకర్షణలో పడితే ఆటపై శ్రద్ధ తగ్గి, కెరీర్ గడి తప్పే ప్రమాదం ఉందంటూ రాబిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో దిగ్గజ ఆటగాళ్లుగా ఎదగాల్సిన వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా వంటి పవర్ ఫుల్ ప్లేయర్లు సరిగ్గా ఇలాంటి పొరపాట్ల వల్లే కెరీర్‌ను నాశనం చేసుకున్నారని గుర్తుచేశారు. ఇదికూడా చదవండి: రోహిత్‌నే తప్పిద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే.. అగార్కర్ పోస్ట్‌కే చెక్ పెట్టేసిన హిట్‌మ్యాన్.. నెక్ట్స్ బాస్‌గా తెలుగోడే..?

సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచాలి..

ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఇచ్చే మైకం ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాత్రికి రాత్రే వచ్చే స్టార్ డమ్, నెటిజన్ల పొగడ్తలు యువ ఆటగాళ్ల మైండ్ సెట్‌ను పూర్తిగా దెబ్బతీస్తాయి.

వైభవ్‌ను సాధ్యమైనంత వరకు సోషల్ మీడియా ప్రపంచానికి దూరంగా ఉంచాలని క్రికెట్ విశ్లేషకులు, ఉతప్ప గట్టిగా సూచిస్తున్నారు. మైదానంలో సాధించే పరుగుల కంటే బయట వచ్చే ప్రచారం వెనుక పడితే అపారమైన ప్రతిభ బూడిదలో పోసిన పన్నీరవుతుందని హెచ్చరించారు. ఇదికూడా చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ ఎఫెక్ట్.. రెండుగా చీలిన బీసీసీఐ.. ప్రపంచకప్ 2027 రేసులో ఉంటాడా లేదా..?

సచిన్ టెండూల్కర్‌ను మించిన ప్రభావాన్ని చూపగలడు..

అయితే, వైభవ్ ప్రతిభపై ఉతప్పకు ఎనలేని నమ్మకం ఉంది. అతడు కేవలం ఆట ఆడటానికి మాత్రమే కాదు, పక్కాగా ‘క్రికెట్ కోసమే పుట్టిన ఆటగాడు’ అని కొనియాడారు. వైభవ్ సాధించే ప్రతి షాట్ వెనుక ఒక అద్భుతమైన టైమింగ్, సహజ సిద్ధమైన పవర్ ఉన్నాయని ప్రశంసించారు.

పరిమిత ఓవర్ల క్రికెట్ లేదా వైట్ బాల్ ఫార్మాట్‌లో సరిగ్గా ఫోకస్ చేస్తే, భారత్ సాధించిన గొప్ప దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపగల సామర్థ్యం వైభవ్ సూర్యవంశీకి ఉందని ఉతప్ప వ్యాఖ్యానించడం విశేషం. ఇదికూడా చదవండి: Video: ఇలాంటి రనౌట్ ఇప్పటి వరకు చూసుండరు.. పట్టరాని కోపంతో కాలితో బంతిని తంతే..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us