మళ్లీ బ్యాట్ పట్టిన ప్రపంచ దిగ్గజాలు.. రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌‌లో పాల్గొంటున్న సచిన్, లారా, సెహ్వాగ్

భారత క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్‌కు శుభవార్త. సచిన్ టెండూల్కర్ మళ్లీ క్రికెట్ బ్యాట్ పట్టబోతున్నాడు. మరోసారి స్టేడియంలో పరుగులు పెట్టనున్నారు.

మళ్లీ బ్యాట్ పట్టిన ప్రపంచ దిగ్గజాలు..  రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌‌లో పాల్గొంటున్న సచిన్, లారా, సెహ్వాగ్
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 05, 2021 | 7:49 PM

Road Safety World Series T20: భారత క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్‌కు శుభవార్త. సచిన్ టెండూల్కర్ మళ్లీ క్రికెట్ బ్యాట్ పట్టబోతున్నాడు. మరోసారి స్టేడియంలో పరుగులు పెట్టనున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు 2013 నవంబరు 16న వీడ్కోలు పలికిన క్రికెట్ దిగ్గజం.. మరోసారి ట్వంటీ-20 లీగ్‌లో మెరవనున్నాడు. బ్రియాన్ లారాతో కలిసి వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో బ్యాట్ పట్టనున్నాడు.. మాస్టర్ బ్లాస్టర్. అంతేకాదు డాషింగ్ ఇండియన్ ఓపెనర్ వీరేంద్ర సెవ్వాగ్ కూడా తన బ్యాట్‌ను ఝుళిపించబోతున్నారు.

ఈ టోర్నమెంట్ 2020 మార్చి 5వ తేదీ నుంచి 16వరకూ భారత దేశ వ్యాప్తంగా జరగనుంది. సునీల్ గవాస్కర్‌కు చెందిన పీఎంజీ, మహారాష్ట్ర రోడ్డు భద్రత విభాగం ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నాయి. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ లీగ్ ఏర్పాటు చేశారు. ఈ టోర్నీలో ఐదు దేశాలకు చెందిన రిటైర్డ్ క్రికెటర్లు ఆడనున్నారు. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ప్లేయర్లు చాలా కాలం తర్వాత తిరిగి బ్యాట్ పట్టుకోనున్నారు. టెండూల్కర్, లారా వంటి దిగ్గజాలతో పాటు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆస్ట్రేలియా బ్రెట్ లీ, శ్రీలంక తిలకరత్నె దిల్‌షాన్, దక్షిణాఫ్రికా జాంటీ రోడ్స్ ఆడుతున్నారు. మొత్తం 110మంది ప్లేయర్లు టోర్నీలో పాల్గొంటున్నారు.

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టి 20కి సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేశారు నిర్వహకులు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ రెండవ ఎడిషన్ మార్చి 5, శుక్రవారం సాయంత్రం 7 గంటల నుండి ప్రారంభమవుతుంది. రాయ్‌పూర్‌లో ఈ రోజు సాయంత్రం 7 గంటలకు బంగ్లాదేశ్ లెజెండ్‌లతో ఇండియా లెజెండ్స్ మొదటి మ్యాచ్‌లో తలపడుతున్నారు. రాయ్‌పూర్ నగరంలో కొత్తగా నిర్మించిన షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 2021 రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ 20 మ్యాచ్‌లు మార్చి 5 నుండి మార్చి 21 వరకు జరుగుతాయి.

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యక్రమాలను రద్దు చేయడంతో గత సంవత్సరం సిరీస్ మొదటి ఎడిషన్ కేవలం నాలుగు మ్యాచ్‌ల తర్వాత నిలిపివేశారు. మహారాష్ట్రలో పెరుగుతున్న కేసుల కారణంగా ప్రస్తుత సిరీస్ వేదికను ముంబై, పూణే నుండి రాయ్‌పూర్‌కు మార్చారు.

2021 రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో మొత్తం 15 టీ 20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇవన్నీ కూడా రాయ్‌పూర్‌లో జరుగుతాయి. ఈ సిరీస్ మార్చి 5 నుండి మార్చి 16 వరకు ప్రతిరోజూ సాయంత్రం 7 గంటలకు మొదలవుతాయి. సెమీ-ఫైనల్స్ మార్చి 17, బుధవారం ఒక మ్యాచ్. మార్చి 19, శుక్రవారం రెండో మ్యాచ్ జరగనున్నాయి. ఈ సిరీస్ చివరి టీ 20 ఫైనల్ మ్యాచ్ మార్చి 21, ఆదివారం జరుగుతుందని నిర్వహకులు తెలిపారు.

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టి 20 ఇండియా జట్టు

సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), వీరేందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, నమన్ ఓజా, జహీర్ ఖాన్, ప్రగ్యాన్ ఓజా, నోయెల్ డేవిడ్, మునాఫ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్, మన్‌ప్రీత్ గోనీ.

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2021 టీ 20

మార్చి 5, శుక్రవారం – ఇండియా లెజెండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ లెజెండ్స్ మార్చి 6, శనివారం – శ్రీలంక లెజెండ్స్ వర్సెస్ వెస్టిండీస్ లెజెండ్స్ మార్చి 7,ఆదివారం – ఇంగ్లాండ్ లెజెండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ లెజెండ్స్ మార్చి 8, సోమవారం – దక్షిణాఫ్రికా లెజెండ్స్ వర్సెస్ శ్రీలంక లెజెండ్స్ మార్చి 9, మంగళవారం – ఇండియా లెజెండ్స్ వర్సెస్ ఇంగ్లాండ్ లెజెండ్స్ మార్చి 10, బుధవారం – బంగ్లాదేశ్ లెజెండ్స్ వర్సెస్ శ్రీలంక లెజెండ్స్ మార్చి 11, గురువారం – ఇంగ్లాండ్ లెజెండ్స్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా లెజెండ్స్ మార్చి 12, శుక్రవారం – బంగ్లాదేశ్ లెజెండ్స్ వర్సెస్ వెస్టిండీస్ లెజెండ్స్ మార్చి 13, శనివారం – భారతదేశం పురాణములు వర్సెస్ సౌత్ ఆఫ్రికా లెజెండ్స్ మార్చి 14 ఆదివారం – శ్రీలంక లెజెండ్స్ వర్సెస్ ఇంగ్లాండ్ లెజెండ్స్ మార్చి 15, సోమవారం – దక్షిణాఫ్రికా లెజెండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ లెజెండ్స్ మార్చి 16, మంగళవారం – ఇంగ్లాండ్ లెజెండ్స్ వర్సెస్ వెస్టిండీస్ లెజెండ్స్ సెమీ-ఫైనల్ 1 – మార్చి 17 బుధవారం, సాయంత్రం 7గంటలకు సెమీ-ఫైనల్ 2 – మార్చి 19, శుక్రవారం, సాయంత్రం 7గంటలకు ఫైనల్ – ఆదివారం, మార్చి 21, సాయంత్రం 7గంటలకు

ఇదీ చదవండిః ఇండిగో విమానంలో కోవిడ్ పేషెంట్ కలకలం.. అప్రమత్తమైన క్యాబిన్ సిబ్బంది.. శానిటైజ్ చేశాక టేక్-ఆఫ్ అయిన ఫ్లైట్