వీరేంద్ర సెహ్వాగ్ విధ్వంసం.. 35 బంతుల్లో 80 పరుగులు .. బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన ఇండియన్ లెజెండ్స్..
Road Safety World Series T20: టీమ్ ఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో తన బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు. కేవలం 35 బంతుల్లో 80 పరుగులు
Road Safety World Series T20: టీమ్ ఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో తన బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు. కేవలం 35 బంతుల్లో 80 పరుగులు చేసి ఇండియా లెజెండ్స్ జట్టును గెలిపించాడు. కరోనా కారణంగా గత ఏడాది 4 మ్యాచ్‌ల తర్వాత వాయిదా పడిన ఈ సిరీస్ శుక్రవారం నుంచి రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పునఃప్రారంభమైంది. బంగ్లాదేశ్ లెజెండ్స్, ఇండియా లెజెండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇండియా జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెల్చి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ లెజెండ్స్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నజీముద్దీన్ (49) తప్ప ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. 110 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండుల్కర్ బంగ్లా బౌలర్లను చితక్కొట్టారు. కెప్టెన్ టెండుల్కర్ కాస్త నెమ్మదిగా ఆడాడు. కానీ వీరేంద్ర సెహ్వాగ్ తొలి బంతి నుంచే బౌండరీలు, సిక్సులతో విరుచుకపడ్డాడు. కేవలం 35 బంతుల్లో సెహ్వాగ్ 80 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో సచిన్ 33 పరుగులతో సహకారం అందించాడు. దీంతో కేవలం 10.1 ఓవర్లలోనే ఇండియా లెజెండ్స్ వికెట్ కోల్పోకుండా 114 పరుగులు చేసి విజయం సాధించింది.
స్కోర్ క్లుప్తంగా : బంగ్లాదేశ్ లెజెండ్స్ : 109 ఆలౌట్ (19.4 ఓవర్లు) (నజీముద్దీన్ 49) ఇండియా లెజెండ్స్ : 114/0 (10.1 ఓవర్లు) (సెహ్వాగ్ 80, సచిన్ 33)
AP Crime News : కాపాడాలని వేడుకుంటే కడతేర్చాడు.. సొంత భార్యనే ఉరేసి చంపిన అనుమానపు భర్త..