RishabhPant : క్రికెట్ గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఫ్రాక్టీస్..పంత్ భయ్యా నీలో ఈ టాలెంట్ కూడా ఉందా ?

ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు, భారత జట్టు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ తన అద్భుతమైన ఫుట్‌బాల్ నైపుణ్యాలను ప్రదర్శించాడు. శిక్షణ సమయంలో తీసిన ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసింది. పంత్ బంతిని చాలా సులువుగా నియంత్రిస్తూ, వేగంగా పాసులు ఇస్తూ కనిపించాడు.

RishabhPant : క్రికెట్ గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఫ్రాక్టీస్..పంత్ భయ్యా నీలో ఈ టాలెంట్ కూడా ఉందా ?
Rishabh Pant

Updated on: Jul 19, 2025 | 10:44 AM

RishabhPant : ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ తనలోని మరో యాంగిల్ చూపించాడు. తనలో దాగున్న అద్భుతమైన ఫుట్‌బాల్ స్కిల్స్ ప్రదర్శించాడు. ట్రైనింగ్ సమయంలో తీసిన ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ షేర్ చేయగా, పంత్ బంతిని చాలా ఈజీగా కంట్రోల్ చేస్తూ వేగంగా పాసులు ఇస్తూ కనిపించాడు. ఈ వినూత్నమైన ట్రైనింగ్ మాంచెస్టర్ ప్రాక్టీస్ వేదిక వద్ద జరిగింది. ఆటగాళ్ల రిఫ్లెక్స్‌లు, సమన్వయం, టీమ్ బాండింగ్‌ను పెంచడానికి జట్టు ఫుట్‌బాల్ ఎక్సర్సైజ్ లను చేర్చింది. బ్యాటింగ్, కీపింగ్‌లో తన శైలిలో ఆకట్టుకునే పంత్, తన ఫుల్ బాల్ కంట్రోల్ చేసే స్కిల్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.

నాలుగో టెస్ట్‌కు ముందు రిషబ్ పంత్ గాయంపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్‌చేట్ కీలక అప్‌డేట్ ఇచ్చాడు. మూడో టెస్ట్‌లో నొప్పిని భరిస్తూనే ఆడిన పంత్, సిరీస్ మిగిలిన మ్యాచ్‌లకు భారత ప్రణాళికల్లో కీలక ఆటగాడిగా ఉన్నాడు. మాంచెస్టర్ టెస్ట్‌కు ముందు మాట్లాడిన డోస్‌చేట్.. పంత్ పట్టుదలను మెచ్చుకున్నారు. అతని కోలుకునే విషయంలో జట్టు జాగ్రత్తగా ఉందని చెప్పాడు. “పంత్ మాంచెస్టర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. మూడో టెస్ట్‌లో అతను చాలా నొప్పితో బ్యాటింగ్ చేశాడు.. కానీ ఇప్పుడు అతని వేలికి నొప్పి తగ్గుతుంది” అని డోస్‌చేట్ తెలిపాడు. గత మ్యాచ్‌లో పంత్ నొప్పితో ఇబ్బంది పడినప్పటికీ, బ్యాట్‌తో తన వంతు కృషి చేశాడు.

పంత్ బ్యాటింగ్ దాదాపు ఖాయమైనప్పటికీ, అయితే, వికెట్ కీపర్‌గా అతని లభ్యతపై ఇంకా స్పష్టత లేదు. మధ్యలో కీపర్‌ను మార్చాల్సి రాకుండా, పంత్ త్వరగా కోలుకోవడానికి జట్టు అతనికి విశ్రాంతినిచ్చింది. ఇంగ్లాండ్ 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్నందున, పంత్ ఫిట్‌నెస్ భారత జట్టుకు చాలా ముఖ్యం. పంత్ ఉనికి భారత జట్టుకు బలాన్ని చేకూరుస్తుంది. సిరీస్‌ను సమం చేయడానికి భారత్ కు అతని సహకారం చాలా అవసరం.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..