AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishabh Pant : జైల్లో ఉంటే బెయిల్ వస్తుంది.. కానీ పంత్ ఎప్పుడు వస్తాడో చెప్పలేం.. అంటే వెస్టిండిస్ సిరీసుకు కూడా ?

ఆసియా కప్ 2025లో టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. ఈ టోర్నమెంట్ తర్వాత, టీమ్ ఇండియా వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పటికీ, టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ను మళ్లీ మైదానంలో చూడటానికి ఇంకా కొంత సమయం వేచి ఉండాల్సి రావచ్చు.

Rishabh Pant : జైల్లో ఉంటే బెయిల్ వస్తుంది.. కానీ పంత్ ఎప్పుడు వస్తాడో చెప్పలేం.. అంటే వెస్టిండిస్ సిరీసుకు కూడా ?
Rishabh Pant
Rakesh
|

Updated on: Sep 23, 2025 | 7:11 AM

Share

Rishabh Pant : ఆసియా కప్ 2025లో టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. ఈ టోర్నమెంట్ తర్వాత, టీమిండియా వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ను మళ్లీ మైదానంలో చూడటానికి ఇంకా కొంత సమయం వేచి ఉండాల్సి రావచ్చు. తాజా నివేదికల ప్రకారం.. పంత్ తన గాయం నుండి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ టెస్ట్ సిరీస్ నుండి కూడా తప్పుకున్నాడు.

వెస్టిండీస్ సిరీస్‌కు పంత్ దూరం

ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫో నివేదిక ప్రకారం.. అక్టోబర్ 2 నుండి వెస్టిండీస్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు రిషబ్ పంత్ సెలక్ట్ కాలేదు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సెప్టెంబర్ 24న ఈ రెండు టెస్టుల సిరీస్‌కు జట్టును ఎంపిక చేయనుంది. కానీ, పంత్‌కు ఇందులో చోటు దక్కే అవకాశం లేదు. అతని కాలి గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడమే దీనికి కారణం.

ఇంకా ప్రాక్టీస్ మొదలుపెట్టలేదు

రిషబ్ పంత్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ప్రస్తుతం అతను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిహాబిలిటేషన్ ప్రక్రియలో ఉన్నాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ నుండి అతనికి ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ రాలేదు. అందుకే అతను ఇంకా బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టలేదు. మెడికల్ టీమ్ నుండి క్లియరెన్స్ రాగానే పంత్ ప్రాక్టీస్ మొదలుపెడతాడు. అయితే, టెస్ట్ సిరీస్‌కు రెండు వారాల కంటే తక్కువ సమయం ఉన్నందున, అతను ఈ సిరీస్‌కు పూర్తిగా సిద్ధంగా ఉండలేడు.

ఆస్ట్రేలియా పర్యటనతో తిరిగి వస్తాడా?

27 ఏళ్ల రిషబ్ పంత్ టీమ్ ఇండియాలోకి ఎప్పుడు తిరిగి వస్తాడనే దానిపై ఇంకా స్పష్టత లేదు. వెస్టిండీస్ సిరీస్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ నాటికి పంత్ ఫిట్‌గా ఉంటాడో లేదో చూడాలి. భారత టెస్ట్ జట్టు వైస్-కెప్టెన్ పంత్‌కు ఇంగ్లాండ్ పర్యటనలో నాలుగో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా క్రిస్ వోక్స్ బంతి తగిలి కుడి కాలికి ఫ్రాక్చర్ అయింది. దీంతో అతను ఐదో టెస్ట్‌లో ఆడలేకపోయాడు. దాని కారణంగానే అతను ఆసియా కప్‌కు కూడా దూరంగా ఉన్నాడు.

రిషబ్ పంత్ లాంటి ఒక కీలక ఆటగాడు జట్టులో లేకపోవడం టీమ్ ఇండియాకు ఒక లోటు. అతని దూకుడు బ్యాటింగ్, వికెట్ కీపింగ్ జట్టుకు చాలా అవసరం. అయితే అతని ఆరోగ్యం ముఖ్యం కాబట్టి పూర్తిగా కోలుకున్న తర్వాతే తిరిగి మైదానంలోకి అడుగు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలో అతను పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి రావాలని ఆశిద్దాం.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..