Rishabh Pant : ఒక కాలుకు నలుపు, మరో కాలుకు తెలుపు.. ఆ బూట్లతో సెహ్వాగ్ రికార్డ్ బ్రేక్ చేసిన రిషబ్ పంత్

గాయం తర్వాత టీమిండియాలోకి అడుగుపెట్టిన స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, కోల్‌కతా టెస్ట్‌లో రెండు కారణాల వల్ల హాట్‌టాపిక్‌గా మారారు. ఒకటి ఆయన రెండు వేర్వేరు డిజైన్లలో ఉన్న బూట్లు ధరించి ఆడటం.రెండవది ఆ ఇన్నింగ్స్‌లోనే దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కీలకమైన భారత రికార్డును బద్దలు కొట్టాడు.

Rishabh Pant : ఒక కాలుకు నలుపు, మరో కాలుకు తెలుపు.. ఆ బూట్లతో సెహ్వాగ్ రికార్డ్ బ్రేక్ చేసిన రిషబ్ పంత్
Rishabh Pant

Updated on: Nov 15, 2025 | 3:06 PM

Rishabh Pant : గాయం తర్వాత టీమిండియాలోకి అడుగుపెట్టిన స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, కోల్‌కతా టెస్ట్‌లో రెండు కారణాల వల్ల హాట్‌టాపిక్‌గా మారారు. ఒకటి ఆయన రెండు వేర్వేరు డిజైన్లలో ఉన్న బూట్లు ధరించి ఆడటం. రెండవది ఆ ఇన్నింగ్స్‌లోనే దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కీలకమైన భారత రికార్డును బద్దలు కొట్టాడు.

గతంలో తీవ్రమైన కాలు గాయం కారణంగా జట్టుకు దూరమైన రిషబ్ పంత్, సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌తో టీమిండియాలోకి తిరిగి వచ్చారు. శుభమన్ గిల్ గాయపడిన తర్వాత ఆయన బ్యాటింగ్‌కు దిగగా, అందరి దృష్టి ఆయన ధరించిన బూట్లపై పడింది. పంత్ రెండు వేర్వేరు డిజైన్లలో ఉన్న బూట్లు వేసుకున్నారు. ఆయన గాయపడిన కాలుకు ఉన్న బూటు ముందు భాగంలో నలుపు రంగులో ఉండగా, రెండవది పూర్తిగా తెల్లగా ఉంది. ఇది గాయం నుంచి కోలుకున్న కాలికి మరింత సపోర్ట్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా తయారుచేసిన బూటు అయి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈ ప్రత్యేకమైన బూట్లతోనే బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్, మాజీ దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కీలకమైన భారత రికార్డును బద్దలు కొట్టారు. పంత్ ఈ ఇన్నింగ్స్‌లో 24 బంతుల్లో 27 పరుగులు చేశాడు. అందులో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.

రిషబ్ పంత్ బద్దలు కొట్టిన రికార్డు టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లకు సంబంధించినది. టెస్ట్ క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ మొత్తం 90 సిక్స్‌లు కొట్టగా, ఈ టెస్ట్‌కు ముందు పంత్ కూడా సరిగ్గా 90 సిక్స్‌లతో సెహ్వాగ్‌తో సమానంగా ఉన్నాడు. కోల్‌కతా టెస్ట్‌లో ఆయన కొట్టిన మొదటి సిక్స్‌తో సెహ్వాగ్ రికార్డును అధిగమించారు. పంత్ ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం రెండు సిక్స్‌లు కొట్టడంతో, ఆయన మొత్తం టెస్ట్ సిక్స్‌ల సంఖ్య 92 కు చేరుకుంది. దీంతో ఆయన టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..