Paris Olympics: నీరజ్ చోప్రా గోల్డ్ గెలిస్తే.. ఫ్యాన్స్‌కు భారీ రివార్డ్ ప్రకటించిన పంత్.. అదేందంటే?

Rishabh Pant on Neeraj Chopra winning gold medal: భారత క్రికెటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నాడు. ఇక్కడ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో మూడో, నిర్ణయాత్మక మ్యాచ్ నేడు అంటే బుధవారం, ఆగస్టు 7న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతోంది. అయితే వన్డే సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో పంత్‌కు అవకాశం లభించలేదు. అయితే మూడో మ్యాచ్‌లో ప్లేయింగ్ 11లో చేరాడు.

Paris Olympics: నీరజ్ చోప్రా గోల్డ్ గెలిస్తే.. ఫ్యాన్స్‌కు భారీ రివార్డ్ ప్రకటించిన పంత్.. అదేందంటే?
Rishabh Pant Neeraj Chopra

Updated on: Aug 07, 2024 | 2:56 PM

Rishabh Pant on Neeraj Chopra winning gold medal: భారత క్రికెటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నాడు. ఇక్కడ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో మూడో, నిర్ణయాత్మక మ్యాచ్ నేడు అంటే బుధవారం, ఆగస్టు 7న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతోంది. అయితే వన్డే సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో పంత్‌కు అవకాశం లభించలేదు. అయితే మూడో మ్యాచ్‌లో ప్లేయింగ్ 11లో చేరాడు. ఈ క్రమంలో ఈ ఎడమచేతి వాటం ఆటగాడు ఒక ప్రత్యేక ట్వీట్ చేశాడు. ఇది పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొంటున్న నీరజ్ చోప్రాకు సంబంధించినది కావడం గమనార్హం.

మంగళవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్‌లో నీరజ్ అథ్లెట్లందరిలో అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్ రౌండ్‌లోకి ప్రవేశించాడు. ఇప్పుడు అందరూ నీరజ్ నుంచి బంగారు పతకాన్ని ఆశిస్తున్నారు. పంత్ కూడా అలాంటిదే కోరుకుంటున్నాడు.

నీరజ్ చోప్రా గోల్డ్ గెలిస్తే రివార్డ్ ప్రకటించిన పంత్..

రిషబ్ పంత్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశాడు. ఇందులో అభిమానులకు భారీ రివార్డులు ప్రకటించాడు. నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిస్తే.. అభిమానులకు రూ. 1లక్ష ఇస్తాను అంటూ ట్వీట్ చేశాడు. అలాగే, టాప్ 10 అభిమానులకు కూడా విమాన టిక్కెట్లు ఇవ్వనున్నట్లు తెలిపాడు.

నీరజ్ చోప్రా ఆగస్టు 8 రాత్రి బంగారు పతకం కోసం బరిలోకి దిగనున్నాడు. నీరజ్‌తోపాటు మొత్తం 12 మంది అథ్లెట్లు స్వర్ణం కోసం పోటీపడనున్నారు. ఇందులో పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ పేరు కూడా ఉంది. అతనితో నీరజ్ ఇటీవలి కాలంలో చాలా పోటీ పడుతున్నారు. అయితే, ప్రతిసారి భారత అథ్లెట్ విజయం సాధించి అర్షద్‌కు నిరాశే ఎదురైంది.

మూడో వన్డేలో రిషబ్ పంత్‌కు ఛాన్స్..

శ్రీలంకతో జరిగే మూడో వన్డేలో రిషబ్ పంత్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ ప్రదర్శన ప్రత్యేకంగా ఏం లేదు. 32 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూడాల్సిన రెండో వన్డేలో రాహుల్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఇటువంటి పరిస్థితిలో టీమిండియాకు క్రమం తప్పకుండా ఆడిన పంత్‌కు అవకాశం లభించింది. మరి మూడో మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుందా లేదా అనేది చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..