Jailer Movie: ‘జైలర్’ సినిమాపై కోర్టుకెక్కిన ఆర్‌సీబీ టీం.. ఆ ‘సీన్ కట్’ చేయాలంటూ తీర్పు..

Royal Challengers Bangalore: ఈ గ్రాండ్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోన్న సినిమా యూనిట్‌ని ఓవివాదం చిక్కుల్లో పడేసింది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఐపీఎల్ టీం 'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు' (RCB) న్యాయ పోరాటం చేస్తోంది. ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో కాంట్రాక్ట్ కిల్లర్ RCB జెర్సీ ధరించి వస్తాడు. అయితే, దాన్ని తొలగించాలంటూ ఆర్సీబీ కోర్టును ఆశ్రయించింది.

Jailer Movie: జైలర్ సినిమాపై కోర్టుకెక్కిన ఆర్‌సీబీ టీం.. ఆ సీన్ కట్ చేయాలంటూ తీర్పు..
Jailer Movie Rcb

Updated on: Aug 29, 2023 | 10:43 AM

Royal Challengers Bangalore vs Jailer Movie: రజినీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘జైలర్’ సినిమా భారీ హిట్ కొట్టింది. ఈ సినిమా కలెక్షన్స్ దాదాపు రూ.600 కోట్లు వసూళ్లు చేసినట్లు వార్తలు వినిపించాయి. ఈ గ్రాండ్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోన్న సినిమా యూనిట్‌ని ఓవివాదం చిక్కుల్లో పడేసింది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఐపీఎల్ టీం ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు’ (RCB) న్యాయ పోరాటం చేస్తోంది. ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో కాంట్రాక్ట్ కిల్లర్ RCB జెర్సీ ధరించి వస్తాడు. అయితే, దాన్ని తొలగించాలంటూ ఆర్సీబీ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును పరిష్కరించేందుకు సన్ పిక్చర్స్ అంగీకరించింది. ఈ సీన్‌ను మారుస్తామని కోర్టులో హామీ ఇచ్చిందని తెలుస్తోంది.

సినిమాలో కథానాయకుడిని వెంబడించే కాంట్రాక్ట్ కిల్లర్ ఆర్‌సీబీ జెర్సీ ధరించాడు. మహిళలపై కూడా చెడు పదజాలం వాడుతుంటాడు. ఈ దృశ్యాన్ని RCB న్యాయ బృందం అభ్యతరం వ్యక్తం చేసింది. “మా జెర్సీని అనధికారికంగా ఉపయోగించడం బ్రాండ్ ప్రజాదరణ, దాని స్పాన్సర్ల ప్రయోజనాలకు హాని కలిగించడమే” అని ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈమేరకు ‘RCB జెర్సీతో సన్నివేశాన్ని కత్తిరించండి లేదా సవరించండి’ అని సన్ పిక్చర్స్‌ను కోర్టు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

జైలర్ కలెక్షన్స్..

దీంతో ఇరువర్గాలు ఒక అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించాలని నిర్ణయించుకున్నాయి. ‘మేం సీన్‌ మారుస్తాం. సవరించిన సన్నివేశాన్ని సెప్టెంబర్ 1 నుంచి థియేటర్‌లో ప్రదర్శిస్తాం. ఆ సీన్ మార్చి OTTలో విడుదల చేస్తామని’ సన్ పిక్చర్స్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, జాకీష్రాఫ్‌, తమన్నా, వినాయకన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదలై నెల రోజులు కావస్తున్నా చాలా చోట్ల మంచి వసూళ్లు రాబడుతోంది.

జైలర్ రికార్డ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..