IPL 2025: ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే RCB సక్సెస్‌కు కారణం అవుతున్న యంగ్‌ ప్లేయర్‌! ఎవరో తెలుసా?

ఐపీఎల్ 2025లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శన చేస్తోంది. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ అద్భుతమైన ప్రదర్శన. ఆటగాళ్ళ మధ్య బాండింగ్, స్వస్తిక్ చీకారా వంటి యువ ఆటగాడి ప్రభావం కూడా విజయానికి కారణం.

IPL 2025: ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే RCB సక్సెస్‌కు కారణం అవుతున్న యంగ్‌ ప్లేయర్‌! ఎవరో తెలుసా?
Rcb Team

Updated on: Apr 09, 2025 | 8:09 PM

ఐపీఎల్‌ 2025లో ఆర్సీబీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. జట్టు మొత్తం సూపర్‌ ఫామ్‌లో ఉండటం ఆర్సీబీకి బాగా కలిసి వస్తోంది. ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌, విరాట్‌ కోహ్లీ.. ఇద్దరిలో ఎవరో ఒకరు కచ్చితంగా నిలబడుతున్నారు. కెప్టెన్‌ పటీదార్‌ రెడ్‌ హాట్‌ ఫామ్‌లో ఉన్నాడు. అలాగే జితేష్‌ శర్మ చాలా బాగా ఆడుతున్నాడు. ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఆర్సీబీకి ఉన్న ప్రధాన లోపం ఈ సీజన్‌లో ఎందుకో కనిపించడం లేదు. అదే బౌలింగ్‌. ఈ సారి ఆర్సీబీ బౌలింగ్‌ సూపర్‌గా ఉంది. భువనేశ్వర్‌ కుమార్‌, జోస్‌ హెజల్‌వుడ్‌, సుయాష్‌ శర్మ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తూ.. వారిపై ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. అలాగే ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా సైతం అదరగొడుతున్నాడు.

బ్యాటింగ్‌లో విషయం పక్కనపెడితే.. బౌలింగ్‌లో దుమ్మురేపుతున్నాడు. అతను స్పిన్‌ బౌలరా? ఫాస్ట్‌ బౌలరా అంటూ క్రికెట్‌ అభిమానులు సరదాగా కామెంట్‌ చేస్తున్నా.. అతని బౌలింగ్‌ మాత్రం ఆర్సీబీకి అద్భుతంగా పనికొస్తోంది. అయితే.. ఆర్సీబీ టీమ్‌ ఫీల్డ్‌లో ఇంత బాగా ప్రదర్శన చేయడానికి మరో కారణం టీమ్‌లోని ప్లేయర్ల మధ్య ఏర్పడిన ఆ బాండింగ్‌. ఒకరి గేమ్‌ను ఒకరు ఎంజాయ్‌ చేస్తూ.. మ్యాచ్‌లు గెలుస్తున్నారు. టీమ్‌లో ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది. మిగతా చాలా టీమ్స్‌లో అది మిస్‌ అవుతోంది. మరి ఆర్సీబీ సీజన్‌లో కేవలం ముగ్గుర్ని మాత్రమే రీటెన్‌ చేసుకుంది. మిగతా వాళ్లంతా కొత్త వాళ్లే. అయినా కూడా టీమ్‌లోని ప్లేయర్లు చాలా త్వరగా కలిసిపోయారు. అందుకు కారణం ఓ యంగ్‌ ప్లేయర్‌.

అతని పేరు స్వస్తిక్ చీకారా. 20 ఏళ్ల ఈ కుర్ర ప్లేయర్‌ చాలా సరదా సరదాగా ఉంటూ.. టీమ్‌లోని మిగతా అందిరితో ఫన్నీగా ఉంటూ టీమ్‌లో ఒక ఫన్‌ జనరేట్‌ చేస్తున్నాడు. అతని వల్లే టీమ్‌లో ఒక మంచి ఎట్మాస్‌ఫీయర్‌ నెలకొందని ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పటీదార్‌ కూడా చెప్పాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోహ్లీ పర్మిషన్‌ లేకుండా అతని స్ప్రే కొట్టుకొని, చాలా బాగుందని కోహ్లీకి చెప్పేంత అల్లరి అతను చేస్తున్నాడు. అలా ఎందుకు చేశావంటే.. భయ్యా హై హమారే అంటూ కోహ్లీపై తన అభిమానం బయటపెట్టాడు. ఇలా ఆర్సీబీ డ్రెస్సింగ్‌ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహం ఉంచడంలో స్వస్థిక్‌ చీకారా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటున్నాడు. ఇప్పటికైతే ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఛాన్స్‌ కోసం వెయిట్‌ చేస్తున్న చీకారా.. ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే జట్టు విజయంలో తన వంత పాత్ర పోషిస్తున్నాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..