RCB vs GT: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య మరి కొద్ది నిముషాల్లో మ్యాచ్ జరగబోతోంది. బెంగళూరు చినస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూరు టీమ్ తమ సొంత గ్రౌండ్‌లో తొలుత బ్యాటింగ్ చేయనుంది. మరోవైపు బెంగళూరులో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షం నేటి మ్యాచ్‌కి అడ్డుపడే అవకాశం ఉంది. ఇంకా ఇప్పటికే మ్యాచ్ స్టార్ట్ అవ్వాల్సి ఉన్నప్పటికీ వర్షం కారణంగా కొంత ఆలస్యంగా ప్రారంభమవనుంది.
కాగా, ఈ రెండు జట్లకు కూడా ఇదే ఈ సీజన్‌లో చివరి గ్రూప్ మ్యాచ్. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ టైటాన్స్ 9 విజయాలతో నేరుగా ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. అలాగే ఆడిన 12 మ్యాచ్‌లలో 7 గెలిచిన ఆర్‌సీబీ నేటి మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశిస్తుంది. ఒక వేళ ఆర్‌సీబీ ఈ టీమ్‌లో వెనకడుగు వేస్తే.. 16 పాయింట్లతో ఉన్న ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. ఇప్పటికే 14 పాయింట్లతో ఉన్న ఆర్‌సీబీకి మరో పాయింట్ పెరుగుతుంది. అప్పుడు కూడా ముంబై టీమ్ ప్లేఆఫ్స్ ఆడుతుంది. ఈ పరిస్థితుల్లో ఆర్‌సీబీ టీమ్‌కి ఇది తప్పనిసరిగా గెలవాల్సిన కీలక మ్యాచ్.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(w), హార్దిక్ పాండ్యా(c), దాసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, యశ్ దయాల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ (w), హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..