RCB Vs CSK: గురుశిష్యుల పోరుపైనే అందరి చూపు.. రికార్డులు చూస్తే కోహ్లీకి పరేషానే.. టీంలో కీలక మార్పులు?

|

Apr 17, 2023 | 3:46 PM

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు చెన్నై, బెంగళూరు 30 సార్లు తలపడగా, అందులో పసుపు జెర్సీ జట్టు 20 సార్లు గెలిచింది. బెంగళూరులో 10 సార్లు విజయం సాధించింది. అంటే ఈరోజు ఈ రెండు జట్ల మధ్య ఐపీఎల్ చరిత్రలో 31వ మ్యాచ్ జరగనుంది.

RCB Vs CSK: గురుశిష్యుల పోరుపైనే అందరి చూపు.. రికార్డులు చూస్తే కోహ్లీకి పరేషానే.. టీంలో కీలక మార్పులు?
Rcb Vs Csk
Follow us on

ఐపీఎల్ 2023లో ఈరోజు 24వ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు తలపడడం ఇదే తొలిసారి. ధోనీ, విరాట్‌లు తొలిసారి ముఖాముఖిగా పోరాటానికి సిద్ధమయ్యారు. ఇద్దరు సూపర్‌స్టార్ క్రికెటర్లు తలపడనుండడంతో అందరి చూపు ఈ మ్యాచ్ పైనే నిలిచింది.

బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటల నుంచి జరగనుంది. ఈ సీజన్‌లో ఇది రెండు జట్లకు 5వ మ్యాచ్. అంతకుముందు జరిగిన 4 మ్యాచ్‌ల్లో ఇరు జట్లు తలో 2 విజయాలు సాధించి, 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి.

IPLలో RCB vs CSK..

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు చెన్నై, బెంగళూరు 30 సార్లు తలపడగా, అందులో పసుపు జెర్సీ జట్టు 20 సార్లు గెలిచింది. బెంగళూరులో 10 సార్లు విజయం సాధించింది. అంటే ఈరోజు ఈ రెండు జట్ల మధ్య ఐపీఎల్ చరిత్రలో 31వ మ్యాచ్ జరగనుంది.

ఇవి కూడా చదవండి

అందరి చూపు వీరిపైనే..

ఈ కీలక పోరులో అందరి చూపు ధోని, కోహ్లీలపైనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే పేలవ ఫాంతో కార్తీక్ తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. నెటిజన్లు మాత్రం కార్తీక్ ప్రదర్శనపై ఓ కన్నేశారు. అలాగే తొలి మ్యాచ్‌లో సత్తా చాటిన బౌలర్ విశాక్ విజయ్ కుమార్‌పైనా చూపులు నిలిచాయి.

చిన్నస్వామి పిచ్ పరిస్థితి..

చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైంది. ఈ మైదానంలో పరుగుల వర్షం కురవనుంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 180 పరుగులు.

RCB vs CSK ప్రాబబుల్ ప్లేయింగ్ XI..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విశాక్ విజయ్ కుమార్.

చెన్నై సూపర్ కింగ్స్: రితురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (సి), తుషార్ దేశ్‌పాండే, మహిష్ తీక్షణ, ఆకాష్‌దీప్, అంబటి రాయుడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..