ఇండియన్ ప్రీమియర్ లీగ్-16 24వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమైంది. బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. చెన్నైలో మార్పు వచ్చింది. ఫాస్ట్ బౌలర్ మగాలా గాయపడ్డాడు. అతని స్థానంలో పతిరనకు అవకాశం దక్కింది.
ఎం చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు మిశ్రమ ప్రదర్శన కనబరిచాయి. రెండు జట్ల మధ్య ఇక్కడ తొమ్మిది మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో చెన్నై, బెంగళూరు చెరో నాలుగు మ్యాచ్‌లు గెలిచాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
RCB కంటే చెన్నై నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లి టీం ఆర్‌సీబీ కేవలం విజయే కాదు.. భారీ తేడాతో విజయం నమోదు చేసేందుకు ప్రయత్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు, CSK కూడా విన్నింగ్ ట్రాక్‌లోకి తిరిగి రావాలని చూస్తోంది. CSK తన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 3 పరుగుల తేడాతో ఓడిపోయింది.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కీపర్/కెప్టెన్), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (కీపర్), హర్షల్ పటేల్, వనిందు హసరంగా, వేన్ పార్నెల్, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..