RCB: నెవర్ ​గివ్ అప్ పాటను విడుదల చేసిన ఆర్సీబీ.. వైరల్ అయిన సాంగ్..

|

Nov 23, 2021 | 10:51 AM

అభిమానులు, ఆటగాళ్లలో జోష్ నింపేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ ఓ సాంగ్‎ను విడుదల చేసింది. ట్విట్టర్‎లో మంగళవారం 'నెవర్ గివ్ అప్' సాంగ్‎​ను రిలీజ్ చేసింది...

RCB: నెవర్ ​గివ్ అప్ పాటను విడుదల చేసిన ఆర్సీబీ.. వైరల్ అయిన సాంగ్..
Rcb
Follow us on

అభిమానులు, ఆటగాళ్లలో జోష్ నింపేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ ఓ సాంగ్‎ను విడుదల చేసింది. ట్విట్టర్‎లో మంగళవారం ‘నెవర్ గివ్ అప్’ సాంగ్‎​ను రిలీజ్ చేసింది. ఈ పాటను వింటూ ఆర్సీబీ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని పొందుతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య, డ్యాన్సర్ ధన్​శ్రీ వర్మ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. హర్ష్​ ఉపాధ్యాయ్​ సంగీతం అందించారు. ఈ పాటలో అలరించిన ఆటగాళ్లందరికీ ఆర్సీబీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది. ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్ఫూర్తి అంటూ ట్విట్టర్‎లో రాసుకొచ్చింది.

నెవర్​గివ్ అప్ పాటలో.. కోహ్లీ, మ్యాక్లీ, పడిక్కల్, చాహల్ సహా ఆటగాళ్లు అందరూ ఆనందంగా చిందులేస్తూ కనిపించారు. ఇటీవలే అన్ని క్రికెట్​ అన్ని ఫార్మాట్లాకు వీడ్కోలు పలికిన ఏబీ డివిలియర్స్ కూడా ప్రత్యేకంగా కనిపించడం విశేషం. ఐపీఎల్-2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. కానీ ఫైనల్ వరకు వెళ్లలేకపోయింది.

Read Also… Ban Vs Pak: చివరి బంతికి రెండు పరుగులు చేయాలి.. ఉత్కంఠ పోరులో గెలుపు ఎవరిదంటే..

Ind Vs Nz: భారత్, న్యూజిలాండ్ కాన్వాయ్‎లోకి ప్రైవేట్ వాహనం.. చివరికి ఏమైందంటే..