Women’s Caribbean Premier League: వెస్టిండీస్‌లో జరుగుతున్న మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో శ్రేయాంక పాటిల్ సంచలనం సృష్టించింది. ఈ టోర్నీలో తొలి భారత క్రీడాకారిణిగా నిలిచిన శ్రేయాంక.. ఇప్పుడు తన స్పిన్ మాయాజాలంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గయానా అమెజాన్ వారియర్స్ జట్టు తరపున ఆడుతున్న 21 ఏళ్ల ఈ భారత ప్లేయర్.. అంతకుముందు జరిగిన ఎమర్జింగ్ ఆసియా కప్‌లో తన సత్తా చాటింది. ఇప్పుడు సీపీఎల్‌లోనూ ఆల్‌రౌండర్ రాణిస్తోంది.
ట్రిన్ బాగో నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గయానా తరపున ఆడిన శ్రేయాంక 4 ఓవర్లలో 15 పరుగులు చేసి 2 వికెట్లు పడగొట్టింది. అలాగే ఈ మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది.
ముఖ్యంగా శ్రేయాంక వేసిన 16వ ఓవర్లో బ్రిటానీ కూపర్ క్లీన్ బౌల్డ్ అయింది. ఆఫ్ స్టంప్ వెలుపల బంతి వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో శ్రేయాంక 3 మ్యాచ్‌ల్లో మొత్తం 6 వికెట్లు పడగొట్టింది. దీంతో ప్రస్తుత టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా నిలిచింది.
What a cracker of a delivery by Shreyanka Patil. pic.twitter.com/EpfVMHIp8c
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 6, 2023
మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున శ్రేయాంక పాటిల్ ఆడింది. అరంగేట్రం టోర్నీలోనే సత్తా చాటిన ఈ యువ క్రీడాకారిణి.. ఇప్పుడు విదేశీ లీగ్‌లోనూ మెరుపులు మెరిపించడం విశేషం.
RCB blood 👑 pic.twitter.com/49rpou4Bf9
— Sports With Bros (@brosswb) September 6, 2023
గయానా అమెజాన్ వారియర్స్ ప్లేయింగ్ XI: స్టెఫానీ టేలర్ (కెప్టెన్) సోఫీ డివైన్, సుజీ బేట్స్, షెమైన్ క్యాంప్‌బెల్ (వికెట్ కీపర్), నటాషా మెక్లీన్, షబికా ఘజన్బీ, శ్రేయాంక పాటిల్, షనేతా గ్రిమ్మండ్, కరిష్మా రంహారక్, షబ్నీమ్ ఇస్మాయిల్, షకేరా సెల్మాన్.
ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: డియాండ్రా డాటిన్ (కెప్టెన్), మేరీ కెల్లీ, లీ-ఆన్ కిర్బీ, కిసియా నైట్ (వికెట్ కీపర్), మిగ్నాన్ డు ప్రీజ్, కిషోనా నైట్, బ్రిటనీ కూపర్, జైదా జేమ్స్, అనీస్ మొహమ్మద్, షామిలియా కానెల్, ఫ్రాన్ జోనాస్.
She is a die-hard of #ViratKohli 👏🏻 pic.twitter.com/cCCuEttoJW
— Esha Srivastav🇮🇳🚩 (@EshaSanju15) September 6, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..