Rajat Patidar Half Century: 5 సిక్స్‌లు.. 2 ఫోర్లు.. 19 బంతుల్లోనే ఫిఫ్టీ.. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లపై కోహ్లీ ఫ్రెండ్ ఊచకోత..

Rajat Patidar Half Century: నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో 41వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతోంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య ఇది ​​రెండో పోరు. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 25 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది.

Rajat Patidar Half Century: 5 సిక్స్‌లు.. 2 ఫోర్లు.. 19 బంతుల్లోనే ఫిఫ్టీ.. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లపై కోహ్లీ ఫ్రెండ్ ఊచకోత..
Rajat Patidar Vs Srh

Updated on: Apr 25, 2024 | 8:47 PM

Rajat Patidar Half Century: నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో 41వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతోంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య ఇది ​​రెండో పోరు. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 25 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఆర్సీబీ ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అలాగే ఎస్‌ఆర్‌హెచ్ భారీ స్కోర్‌ను కూడా బ్రేక్ చేయాలని చూస్తోంది. కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ రజత్ పాటిదార్ కేవలం 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

రజత్ పాటిదార్ 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ..

రజత్ పాటిదార్ క్రీజులోకి వచ్చిన వెంటనే దూకుడు బ్యాటింగ్‌తో హైదరాబాద్ బౌలర్లకు దడ పుట్టించాడు. కేవలం 19 బంతుల్లోనే 5 సిక్సులు, 2 ఫోర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. అయితే, ఆవెంటనే పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. దీంతో బెంగళూరు జట్టు 130 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us