ఆర్సీబీ ‘గోల్డెన్ హార్స్’ పై కన్నేసిన ఫ్రాంచైజీలు.. వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?

IPL Auction 2027 Rumors: ట్రోఫీలను తెచ్చిపెట్టే ఇటువంటి అరుదైన ఆటగాడిని ఆర్సీబీ మేనేజ్‌మెంట్ అంత సులభంగా వదులుకుంటుందా అనేది పెద్ద ప్రశ్న. 2027 ఐపీఎల్ సీజన్లో కూడా హేజిల్‌వుడ్‌ను జట్టులోనే ఉంచుకుని, ఐపీఎల్ చరిత్రలో వరుసగా మూడుసార్లు కప్పు గెలిచిన ఏకైక జట్టుగా హ్యాట్రిక్ సాధించాలని బెంగళూరు భావిస్తోంది. మరి వచ్చే ఏడాది వేలంలో ఏం జరుగుతుందో చూడాలి!

ఆర్సీబీ గోల్డెన్ హార్స్ పై కన్నేసిన ఫ్రాంచైజీలు.. వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
Rcb Lucky Player

Updated on: Jun 02, 2026 | 8:01 AM

RCB Lucky Player: ఒకప్పుడు దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇప్పుడు ఐపీఎల్‌లో తిరుగులేని లక్కీ టీమ్‌గా అవతరించింది. వరుసగా రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి సరికొత్త చరిత్ర సృష్టించిన బెంగళూరు విజయం వెనుక ఓ గెలుపు గుర్రం ఉన్నాడు. తొమ్మిదికి తొమ్మిది ఫైనల్స్ గెలిపించిన ఆ అరుదైన ఆటగాడి కోసం ఇతర జట్లు ఇప్పుడే రూ. 30 కోట్ల వ్యూహాలు రచిస్తున్నాయి.

బ్యాడ్ లక్ నుంచి బ్యాక్-టు-బ్యాక్ ఛాంపియన్స్ వరకు.. ఆర్సీబీ సంచలనం..!

ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ కప్పును వరుసగా రెండు సీజన్లలో కైవసం చేసుకుని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల దశాబ్దాల నిరీక్షణకు తెరదించింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత వరుసగా రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ చరిత్ర పుటల్లోకెక్కింది. 2025లో జట్టు పగ్గాలు చేపట్టిన రజత్ పాటిదార్ అతి తక్కువ మ్యాచుల్లోనే రెండు ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించారు. అయితే ఈ అద్భుత విజయాల వెనుక కెప్టెన్ వ్యూహాలతో పాటు జట్టులో ఉన్న ఒక ఆస్ట్రేలియా పేసర్ అపజయం ఎరుగని ‘లక్కీ సెంటిమెంట్’ అత్యంత కీలకంగా మారింది.

ఇది కూడా చదవండి: Video: ఆర్సీబీకి దిమ్మతిరిగే షాక్.. స్టార్ ప్లేయర్‌పై నిషేధంతోపాటు జరిమానా..!

ఫైనల్ ఆడితే.. కప్పు గెలవాల్సిందే..!

ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆ గెలుపు గుర్రం మరెవరో కాదు.. ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్. వైట్ బాల్ క్రికెట్ చరిత్రలో హేజిల్‌వుడ్ అడుగుపెట్టిన ఏ ఒక్క ఫైనల్ మ్యాచ్‌ను కూడా ఆయన ఆడిన జట్టు ఓడిపోలేదు. ఇప్పటివరకు తన కెరీర్‌లో మొత్తం తొమ్మిది పరిమిత ఓవర్ల ఫైనల్ మ్యాచులు ఆడిన హేజిల్‌వుడ్, తొమ్మిది సార్లూ విజేతగా నిలిచి క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన ‘గోల్డెన్ లెగ్’ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

2010 నుంచి మొదలైన అప్రతిహత విజయయాత్ర..

హేజిల్‌వుడ్ లక్కీ సెంటిమెంట్ ఈనాటిది కాదు. 2010 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా తరపున నాలుగు వికెట్లు తీసి జట్టును గెలిపించడంతో ఈ ప్రస్థానం ప్రారంభమైంది.

2012: సిడ్నీ సిక్సర్స్ తరపున ఛాంపియన్స్ లీగ్ టీ20 ఫైనల్ విజయం.

2015: ఆస్ట్రేలియా గెలిచిన వన్డే ప్రపంచకప్ జట్టులో సభ్యుడు.

2020: బిగ్ బాష్ లీగ్ ఫైనల్‌లో సిడ్నీ సిక్సర్స్ విజయంలో భాగస్వామి.

2021: చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి, మునుపటి సీజన్ వైఫల్యాల నుంచి సీఎస్‌కే మాస్ కమ్‌బ్యాక్ ఇవ్వడంలో కీలక పాత్ర.

2021 (టీ20 ప్రపంచకప్): న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో మూడు వికెట్లు తీసి ఆస్ట్రేలియాకు తొలి టీ20 ప్రపంచకప్ అందించాడు.

2023 (వన్డే ప్రపంచకప్): అహ్మదాబాద్‌లో భారత్‌తో జరిగిన ఫైనల్‌లో రెండు కీలక వికెట్లు తీసి టీం ఇండియా ఆశలపై నీళ్లు చల్లాడు.

ఇది కూడా చదవండి: తోపులుగా వచ్చి తుస్సుమన్న ఐదుగురు.. పద్ధతిగా రిటైర్మెంట్‌ చేస్తే పరువైనా మిగిలేనుగా..!

ఆర్సీబీ డబుల్ ధమాకా.. వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు?

ఈ అద్భుతమైన ట్రాక్ రికార్డుతోనే 2025, 2026 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో హేజిల్‌వుడ్ ప్రధాన భూమిక పోషించాడు. కేవలం అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యమే కాకుండా, జట్టులోకి గెలుపును ఆకర్షించే సెంటిమెంట్ కూడా ఉండటంతో ఇతర ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను ఇప్పుడు ఇతనిపై పడింది. వచ్చే ఏడాది జరగబోయే మెగా వేలంలోకి ఒకవేళ హేజిల్‌వుడ్ వస్తే, అతని కోసం ఏకంగా రూ. 30 కోట్ల వరకు ఖర్చు చేయడానికి పలు జట్లు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us