RCB Cares : అమ్మో.. 10 లక్షలు కాదట, 25 లక్షలట.. ఆర్‌సీబీ బాధితులకు భారీ పరిహారం!

బెంగళూరు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పెద్ద సహాయం ప్రకటించింది. విక్టరీ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన 11 మంది కుటుంబాలకు భారీగా పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో ఈ పరిహారం రూ.10 లక్షలు ఉండగా, ఇప్పుడు దానిని పెంచారు.

RCB Cares : అమ్మో.. 10 లక్షలు కాదట, 25 లక్షలట.. ఆర్‌సీబీ బాధితులకు భారీ పరిహారం!
Stampede Victims

Updated on: Aug 30, 2025 | 3:48 PM

RCB Cares : బెంగుళూరులో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్‌సీబీ) భారీ ఆర్థిక సహాయం ప్రకటించింది. విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట కారణంగా మరణించిన 11 మంది కుటుంబాలకు భారీ నష్టపరిహారం ఇస్తామని ఆర్‌సీబీ తెలిపింది. ఇంతకు ముందు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించగా, ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ఆర్‌సీబీ మొదటిసారిగా టైటిల్ గెలుచుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని జూన్ 4న విక్టరీ పరేడ్‌ను నిర్వహించారు. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోగా, 50 మంది గాయపడ్డారు.

ఆర్‌సీబీ తీసుకున్న పెద్ద నిర్ణయం

ఆర్‌సీబీ ఫ్రాంచైజీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయం ప్రకటించింది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపింది. ఆర్‌సీబీ పోస్ట్‌లో.. “జూన్ 4, 2025న మా హృదయం ముక్కలైంది. మేము మా ఆర్‌సీబీ కుటుంబంలోని 11 మంది సభ్యులను కోల్పోయాం. వారు మాలో ఒకరు. వారి నగరానికి, మా సమాజానికి, మా జట్టుకు ప్రత్యేకమైన వారిలో వారు భాగం. వారి లేని లోటు ఎప్పటికీ మా జ్ఞాపకాల్లో ఉంటుంది. ఏ సహాయం కూడా ఆ లోటును పూడ్చలేదు, కానీ ఒక మొదటి అడుగుగా ఆర్‌సీబీ వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున అందిస్తోంది. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఇది నిరంతర సంరక్షణకు మా వాగ్దానం కూడా.” అంటూ రాసుకొచ్చింది.

జూన్ 4న ఏం జరిగింది?

17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్‌సీబీ జూన్ 3న అహ్మదాబాద్‌లో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ సందర్భంగా జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విక్టరీ పరేడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ పరేడ్ సందర్భంగా స్టేడియం వెలుపల అభిమానుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించగా, సుమారు 50 మంది గాయపడ్డారు. కర్ణాటక ప్రభుత్వం ఈ ఘటనకు ఆర్‌సీబీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని బాధ్యులుగా పేర్కొంది. ఈ కేసుపై ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతోంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి