IPL 2025: ఆర్‌సిబి కెప్టెన్ గురించి అశ్విన్ ఏమన్నారో తెలుసా? అతనికి మించిన వారు లేరు అంటూ…

|

Dec 02, 2024 | 1:14 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) జట్టులో కెప్టెన్సీ చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఫాఫ్ డుప్లెసిస్‌ను ఫ్రాంచైజీ విడుదల చేయడంతో, కొత్త కెప్టెన్ ఎవరు ఉంటారనే ప్రశ్న అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. మెగా వేలంలో కూడా ఆర్‌సిబి కెప్టెన్సీకి అనువైన కొత్త ఆటగాడిని కొనుగోలు చేయలేకపోవడం ఈ చర్చలను మరింత ఆసక్తికరంగా మార్చింది. అయితే, మాజీ ఆర్‌సిబి స్టార్ ఎబి డివిలియర్స్ చేసిన ప్రకటనతో కెప్టెన్సీపై చర్చకు కొత్త మలుపు వచ్చింది. అతని మాటల ప్రకారం, విరాట్ కోహ్లీ మళ్లీ ఆర్‌సిబికి నాయకత్వం వహించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.

IPL 2025: ఆర్‌సిబి కెప్టెన్ గురించి అశ్విన్ ఏమన్నారో తెలుసా? అతనికి మించిన వారు లేరు అంటూ...
Virat Kohli And Ravichandran Ashwin
Follow us on

ఐపీఎల్ 2025 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ చర్చలు జరుగుతున్నాయి. ఫాఫ్ డుప్లెసిస్ విడుదల తర్వాత, విరాట్ కోహ్లీ మళ్లీ నాయకత్వం వహించే అవకాశం ఉందని ఎబి డివిలియర్స్, రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఆర్‌సిబి జట్టు వ్యూహాలను ప్రశంసించిన అశ్విన్, కోహ్లీ అనుభవం జట్టుకు కీలకమని పేర్కొన్నారు.

స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా విరాట్ కోహ్లీనే ఆర్‌సిబి కెప్టెన్‌గా ఉంటాడని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో అశ్విన్ మాట్లాడుతూ, ఆర్‌సిబి మరో కెప్టెన్‌ను కొనుగోలు చేసే అవకాశం తక్కువగా ఉందని, విరాట్ మళ్లీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అశ్విన్ తన వ్యాఖ్యలో కోహ్లీని నమ్మదగిన కెప్టెన్‌గా పేర్కొంటూ, ప్రస్తుతం జట్టులో అతనికి ఉన్న అనుభవం, నాయకత్వ సామర్థ్యం మరెవరితోనూ సరిపోల్చలేనిదని చెప్పాడు.

ఆర్‌సిబి వేలం వ్యూహం గురించి కూడా అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఫ్రాంచైజీ వారి జట్టును సమతూకంగా కొనుగోలు చేసిందని. జట్టలోని అన్ని విభాగాల్లో ఆటగాళ్లను బలోపేతం చేయడమనేది ఎప్పుడు జట్టు విజయానికి కారణమవుతుందని పేర్కొన్నాడు. పర్సుల్లో భారీ మొత్తాలు ఉన్న ఇతర జట్లకు వ్యతిరేకంగా, ఆర్‌సిబి వేచి చూసే వ్యూహంతో ముందుకెళ్లిందని, ఇది వారికి విజయవంతమైన ఎంపికలుగా మారిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

మరోవైపు, ఆర్‌సిబి క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ కూడా కెప్టెన్సీపై తన అభిప్రాయాలను వెల్లడించారు. విరాట్ కోహ్లీ జట్టులో కీలక వ్యక్తి అని, కానీ కెప్టెన్సీ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలు, కోహ్లీకి ఉన్న అనుభవం, కెప్టెన్సీ ప్రతిభ పరిగణనలోకి తీసుకుంటే, అభిమానులు అతని నాయకత్వంలో జట్టును మరోసారి చూస్తారని ఆశిస్తున్నారు.

మొత్తం మీద, ఆర్‌సిబి కెప్టెన్సీ చర్చ ఈ ఐపీఎల్ సీజన్‌కు పెద్ద విశేషంగా మారింది. విరాట్ కోహ్లీ మళ్లీ నాయకత్వం వహిస్తే, ఇది ఆర్‌సిబి అభిమానులకు గొప్ప క్షణంగా నిలుస్తుంది.