బాల్ ట్యాంపరింగ్‌తోనే 5 వికెట్లు తీశాడంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. బ్యాట్‌తో ఆసీస్ బెండు తీసిన జడ్డూ.. 4 రికార్డులు బ్రేక్

India vs Australia: బంతితో విధ్వంసం సృష్టించిన రవీంద్ర జడేజా బ్యాట్‌తోనూ తన సత్తా చాటడంతో నాగ్‌పూర్‌లో కంగారూలకు ముచ్చెమటలు పట్టుకున్నాయి.

బాల్ ట్యాంపరింగ్‌తోనే 5 వికెట్లు తీశాడంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. బ్యాట్‌తో ఆసీస్ బెండు తీసిన జడ్డూ.. 4 రికార్డులు బ్రేక్
Ravindra Jadeja

Updated on: Feb 10, 2023 | 6:34 PM

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు రెండో రోజు ఆటముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 144 పరుగుల ఆధిక్యం సాధించింది. శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 7 వికెట్లకు 321 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ గరిష్టంగా 120 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అజేయంగా నిలిచాడు. కంగారూ జట్టు తరపున అరంగేట్రం ఆడుతున్న టాడ్ మర్ఫీ 5 వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, నాథన్‌ లియాన్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

ఈ క్రమంలో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తొలుత బంతితోనూ, ఆ తర్వాత బ్యాట్‌తోనూ సత్తా చాటి, విమర్శకులకు గట్టి సమాధానమిచ్చాడు. అలాగే కపిల్ దేవ్‌ను వెనక్కునెట్టడమే కాకుండా, తన పేరుతో మరెన్నో రికార్డులను నెలకొల్పాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

నాగ్‌పూర్‌లో బంతితో విధ్వంసం సృష్టించిన రవీంద్ర జడేజా బ్యాట్‌తోనూ అద్భుతాలు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో, జడేజా మొదటి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత అతని బ్యాట్‌ నుంచి అర్ధ సెంచరీ కూడా వచ్చింది. దీంతో రవీంద్ర జడేజా భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

భారత్ తరపున ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక అర్ధసెంచరీలు, ఐదు వికెట్లు సాధించిన ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. జడేజా నాలుగోసారి ఈ ఘనత సాధించాడు.

మాజీ కెప్టెన్, వెటరన్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ రికార్డును రవీంద్ర జడేజా బద్దలు కొట్టాడు. కపిల్ 4 సార్లు ఈ ఫీట్ చేయగా ఇప్పుడు జడ్డూ అతని కంటే ముందున్నాడు.

కాగా, మొదటి రోజు గేమ్‌లో రవీంద్ర జడేజాను బాల్ టాంపరింగ్ చేశాడంటూ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. మొదటి రోజు జడేజా తన వేలికి పెయిన్ కిల్లర్ క్రీమ్ రాసుకోవడం కనిపించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ మీడియా టాంపరింగ్ చేశాడంటూ జడేజాపై విమర్శలు చేసింది. కాగా, మ్యాచ్ రిఫరీ భారత ఆల్ రౌండర్‌కు క్లీన్ చిట్ ఇవ్వడంతో వివాదానికి తెర పడింది.

రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. భారతదేశంలో ఆడిన 3 వరుస బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 5 వికెట్లు సాధించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..