Ravichandran Ashwin Tweet: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ ఐపీఎల్. ఈ టోర్నమెంట్‌లో ఆడాలని ప్రతీ క్రికెటర్ కోరుకుంటాడు. అయితే ఆ అవకాశం అందరికీ రాదు. చాలా తక్కువ మందికే దొరుకుతుంది. ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేసుకుంటారు.
ఇటీవల చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేలం పాటలో చాలామంది ఆటగాళ్లు భారీ ధరలు పలికారు. అంతేకాకుండా డొమెస్టిక్ క్రికెట్‌లో రాణిస్తున్న కొత్తవారికి, యువకులకు సైతం ఛాన్స్ లభించింది. అయితే ఈ వేలం గనుక నాలుగు రోజుల తర్వాత జరిగి ఉంటే ఓ ఆటగాడిని కోట్లు పెట్టి కోనేవాళ్లని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక అతనే న్యూజిలాండ్‌కు చెందిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ డేవాన్ కాన్‌వే.
డేవాన్ కాన్‌వే ఐపీఎల్ వేలం పాటలో తన పేరును నమోదు చేసుకున్న ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపించలేదు. అయితే అందుకు నిరుత్సాహ పడకుండా కాన్‌వే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 59 బంతుల్లో 99 పరుగులు చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఆరు టీ20 మ్యాచ్ ఆడిన కాన్‌వేపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించేందుకు కాన్‌వే ఇన్నింగ్స్ కాస్త లేట్ అయిందని.. అందుకే ఐపీఎల్ ఛాన్స్ మిస్సయాడని అందరూ అంటున్నారు. ఇదే విషయాన్ని ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ కూడా ప్రస్తావిస్తూ.. తన ట్విట్టర్ ద్వారా అద్భుతమైన ట్వీట్ చేశాడు. ”కాన్‌వే ఇజ్ జస్ట్ ఫోర్ డేస్ లేట్.. జస్ట్ మిస్ బ్రదర్.. బట్ సూపర్బ్ ఇన్నింగ్స్’ అంటూ పేర్కొన్నాడు.
ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?
ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!
రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!
Devon Conway is just 4 days late, but what a knock ??? #AUSvNZ
— Ashwin ?? (@ashwinravi99) February 22, 2021