
Ravi Shastri : భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి భారత క్రికెట్ చరిత్రలో టాప్ 5 గొప్ప క్రికెటర్లను సెలక్ట్ చేశారు. జస్‌ప్రీత్ బుమ్రాను కూడా ప్రశంసించినా, టాప్ 5లో మాత్రం అతనికి చోటు దక్కలేదు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్లను టాప్ 5లో ఉంచిన శాస్త్రి, వారిలో నంబర్ 1 ఆటగాడు ఎవరో కూడా వెల్లడించారు. రవిశాస్త్రి ది ఓవర్‌ల్యాప్ క్రికెట్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌పై చర్చించారు. ఈ సంభాషణలో మైఖేల్ వాన్ మాట్లాడుతూ.. ఇంగ్లాండ్‌లో ఫుట్‌బాల్‌పై ఉన్న పిచ్చి కంటే భారత్‌లో క్రికెట్‌పై ఉన్న పిచ్చి 10 రెట్లు ఎక్కువ అని భావిస్తున్నానని చెప్పాడు.
షో చివరిలో మైఖేల్ వాన్ రవిశాస్త్రి ని అడిగాడు.. ఇండియాలోని టాప్ 5 గొప్ప క్రికెటర్లలో మీరు ఎవరిని ఎంచుకుంటారు?. దీనికి రవిశాస్త్రి ఆటగాళ్ల పేర్లు చెప్పారు. ఐదవ స్థానంలో ఉన్న ఆటగాడి గురించి కొద్దిసేపు ఆలోచించి ఆపై ఎంఎస్ ధోని పేరును తీసుకున్నారు. తాను ప్రతి దశాబ్దానికి ఒక బెస్ట్ ప్లేయర్ గా సెలక్ట్ చేసినట్లు శాస్త్రి చెప్పారు.
* 1970ల దశాబ్దం: సునీల్ గవాస్కర్
* 1980ల దశాబ్దం: కపిల్ దేవ్
* 1990ల దశాబ్దం: సచిన్ టెండూల్కర్
* ఆ తర్వాత: ఎంఎస్ ధోని
* ఆ తర్వాత: విరాట్ కోహ్లీ
ఆ తర్వాత సంభాషణలో ఉన్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ వీరిలో నంబర్ 1 ఎవరు.. గవాస్కరేనా అని అడిగారు. దీనికి రవిశాస్త్రి కపిల్ దేవ్ పేరు అని తెలిపాడు. అతను అద్భుతమైన ఆటగాడు. మొత్తం ప్యాకేజీ గురించి మాట్లాడితే సచిన్ టెండూల్కర్ అని ఆన్సర్ ఇచ్చాడు. సచిన్ టెండూల్కర్ ను ప్రశంసిస్తూ తను 24 సంవత్సరాలు క్రికెట్ ఆడాడని, 100 ఇంటర్నేషనల్ సెంచరీలు సాధించాడని శాస్త్రి అన్నారు. దీనిపై అక్కడ ఉన్న ప్రతి దిగ్గజం సచిన్ ను పొగిడారు.
ఈ మొత్తం సంభాషణలో రవిశాస్త్రి ని ఇంకో ప్రశ్న అడిగారు.. ఇండియా వర్సెస్ పాకిస్థాన్, ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ లలో దేన్ని మీరు పెద్ద ప్రత్యర్థులుగా భావిస్తారు? దీనికి శాస్త్రి ఇలా అన్నారు, నేను ఆడిన సంవత్సరాలను బట్టి ఇండియా వర్సెస్ పాకిస్థాన్ అన్నారు. అయితే, గత 10 సంవత్సరాలుగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే సిరీస్‌ల ఆదరణ పెరిగిందని ఆయన చెప్పారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..