ICC World Test Championship Final 2023: ప్రస్తుతం ఐపీఎల్ చివరి మ్యాచ్‌లు జరుగుతున్నాయి. వీటి తర్వాత అంతర్జాతీయ క్రికెట్ సీజన్ మొదలుకానుంది. ముఖ్యంగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదే క్రమంలో ఇప్పటికే టీమిండియా తొలి బ్యాచ్ ఇంగ్లండ్‌కు ప్రయాణం అయింది. కాగా, ఆస్ట్రేలియాతో తలపడే భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అంచనా వేశాడు. జూన్ 7, బుధవారం నుంచి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ఈ కీలక పోరు మొదలుకానుంది.
ప్రపంచ స్థాయి స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాతో పాటు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఒక ఆల్ రౌండర్‌తో పాటు టీమిండియా బరిలోకి వెళ్లనుందని చెప్పుకొచ్చాడు.
“ఓవల్ ట్రాక్ గట్టిగా, పొడిగా ఉంటే, ఇద్దరు స్పిన్నర్లు ఖచ్చితంగా ఆడాలని కోరుకుంటాను. ఇంగ్లాండ్‌లోని వాతావరణంతో ఇది చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం ఎండగా ఉంది. కానీ, ఇంగ్లీష్ వాతావరణం ఎలా ఉంటుందో జూన్ నెలలో తెలుస్తుంది” అంటూ తెలిపాడు.
“కాబట్టి, ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఒక ఆల్ రౌండర్‌తో భారత్ బరిలోకి దిగుతుంది. ఇది మంచి కలయిక అవుతుంది. ఆపై ఐదుగురు బ్యాట్స్‌మెన్స్, వికెట్ కీపర్ ఉంటారు. అంటే మొత్తం ఆరుగురు బ్యాట్స్‌మెన్స్ లిస్టులో ఉంటారు. ఓవల్‌లో అన్ని పరిస్థితులు సాధారణంగానే ఉంటే, ఇదే నా టీమ్‌గా ఉంటుంది” అంటూ ప్రకటించాడు.
“ఇంగ్లండ్‌లో గతసారి జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ చాలా బాగా ఆడింది. ఎందుకంటే ఆ టీంలో బుమ్రా ఉన్నాడు. అలాగే షమీ ఉన్నాడు. ఇంకా శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. టీమిండియాకు కీలకమైన నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అయితే, ఇందులో శార్దూల్ మాత్రం ఆల్ రౌండర్‌గా బరిలోకి దిగాడు” అంటూ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
జడేజా, అశ్విన్‌లను ప్లేయింగ్ XIలో ఎంపిక చేయడం వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆయన పేర్కొన్నాడు. ఇద్దరు అనుభవజ్ఞులైన బౌలర్లు ఆటను భారత్‌కు అనుకూలంగా మార్చే లక్షణాలను కలిగి ఉన్నారు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సత్తా చాటేందుకు అవకాశం ఉంది.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
టీమిండియా స్వ్కాడ్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (కీపర్).
స్టాండ్‌బై ఆటగాళ్లు: రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..