
Ravi Bishnoi : గౌహతిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్‌కు చోటు దక్కింది. దాదాపు 355 రోజుల తర్వాత టీమిండియా జెర్సీ ధరించిన బిష్ణోయ్, తనపై ఉన్న అంచనాలను ఏమాత్రం వమ్ము చేయలేదు. 4 ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కివీస్ జట్టులో డేంజర్ బ్యాటర్లుగా పేరున్న గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్‌లను అవుట్ చేసి న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. అతని కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ చూస్తుంటే, అతను ఎక్కడా ఫామ్ కోల్పోయినట్లు కనిపించలేదు.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రవి బిష్ణోయ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. “రవి బిష్ణోయ్‌కు తన బలాలు ఏంటో బాగా తెలుసు. ఏ సమయంలో ఏ బంతి వేయాలి, బ్యాటర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అతను ముందే పసిగడతాడు. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు తన అద్భుత ప్రదర్శనతో ఆ ఒత్తిడిని దూరం చేస్తాడు. అటువంటి ఆటగాడు మా జట్టులో ఉండటం మాకు దక్కిన గౌరవం” అని సూర్య పేర్కొన్నాడు. బిష్ణోయ్ వికెట్ల మధ్య స్పీడు, గూగ్లీలు వేయడంలో ఉన్న నైపుణ్యం టీమిండియా బౌలింగ్‌కు కొత్త శక్తిని ఇచ్చాయి.
అయితే జట్టుకు దూరంగా ఉన్న ఆ 355 రోజులు బిష్ణోయ్ ఏం చేశాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై రవి మాట్లాడుతూ.. “జట్టుకు దూరమైనా క్రికెట్‌కు మాత్రం దూరం కాలేదు. నా సొంత ఊరు జోధ్‌పూర్‌లో నా కోచ్‌తో కలిసి ప్రతిరోజూ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాను. నా బౌలింగ్‌లో ఉన్న లోపాలను సరిదిద్దుకున్నాను. విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ, రంజీ ట్రోఫీలో మ్యాచ్‌లు ఆడటం వల్ల నాకు మ్యాచ్ ప్రాక్టీస్ లభించింది. దేశవాళీ క్రికెట్‌లో రాణించడం వల్లే ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేయగలిగాను” అని తన కష్టాన్ని వివరించాడు.
రవి బిష్ణోయ్ రీఎంట్రీ టీమిండియాకు రాబోయే టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఒక గొప్ప సంకేతం. కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ వంటి క్వాలిటీ స్పిన్నర్లు అందుబాటులో ఉండటం భారత్‌కు పెద్ద బలం. గౌహతి విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్, రాబోయే మ్యాచ్‌ల్లో కూడా ఇదే దూకుడును ప్రదర్శించాలని భావిస్తోంది. బిష్ణోయ్ లాంటి ఆటగాళ్లు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటే భారత్ బౌలింగ్ విభాగం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరంగా మారుతుందనడంలో సందేహం లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..