IND vs ZIM: గంభీర్ వద్దన్నాడు.. లక్ష్మణ్ రమ్మన్నాడు.. జింబాబ్వే టూర్‌కు లక్కీ ఛాన్స్..?

VVS Laxman India Stand In Coach: గాయాల కారణంగా వరుణ్ చక్రవర్తి వంటి కీలక స్పిన్నర్ దూరం కావడం శ్రేయస్ అయ్యర్ సేనకు పెద్ద ఎదురుదెబ్బే అయినప్పటికీ, రవి బిష్ణోయ్ వంటి అనుభవజ్ఞుడైన స్పిన్నర్ తిరిగి లయ అందుకోవడానికి ఇదొక సువర్ణావకాశం. జింబాబ్వే గడ్డపై బిష్ణోయ్ మళ్లీ పాత ఫామ్‌ను అందుకుని జట్టును విజయాల బాట పట్టిస్తాడో లేదో వేచి చూడాలి.

IND vs ZIM: గంభీర్ వద్దన్నాడు.. లక్ష్మణ్ రమ్మన్నాడు.. జింబాబ్వే టూర్‌కు లక్కీ ఛాన్స్..?
Ind vs Zim

Updated on: Jul 12, 2026 | 12:47 PM

Team India T20I Squad vs Zimbabwe Tour: ఇంగ్లాండ్ పర్యటనలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియాకు ఆసియా క్రీడలకు ముందు మరో భారీ షాక్ తగిలింది. జులై 9న బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ రోజే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. మోకాలి నరాల (హామ్‌స్ట్రింగ్) గాయాల కారణంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాలు ఈ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరం కావడమే కాకుండా, రాబోయే జింబాబ్వే పర్యటనకు కూడా అందుబాటులో ఉండటం లేదని బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వరుణ్ చక్రవర్తి స్థానంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

లక్ష్మణ్ సమక్షంలో బీసీసీఐ కీలక నిర్ణయం..

‘స్పోర్ట్స్ స్టార్’ కథనం ప్రకారం.. జింబాబ్వే పర్యటనకు వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేసే ప్రక్రియలో తాత్కాలిక ప్రధాన కోచ్ వివిఎస్ లక్ష్మణ్‌తో బీసీసీఐ సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపింది. రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ పర్యటనకు దూరం కానుండటంతో, లక్ష్మణ్ పర్యవేక్షణలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని కుల్దీప్ యాదవ్ కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితం కావడంతో, ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో వరుణ్ చక్రవర్తి భారత్‌కు ప్రధాన స్పిన్నర్‌గా మారాడు. అయితే అతని దురదృష్టకర గాయం, నిలకడలేమితో సతమతమవుతున్న రవి బిష్ణోయ్‌కు ఒక అద్భుతమైన అవకాశంగా మారింది.

నిరూపించుకోవడానికి రవి బిష్ణోయ్‌కు ఆఖరి అవకాశం..

ఒకప్పుడు భారత మేటి స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు గట్టి పోటీదారుడిగా ఎదిగిన రవి బిష్ణోయ్, న్యూజిలాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోల్పోయాడు. అయితే ఐపీఎల్ 2026 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ తరఫున కొన్ని ఉపయోగకరమైన ఇన్నింగ్స్‌లు ఆడి మళ్లీ ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. కానీ ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా బిష్ణోయ్ దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో జింబాబ్వే పర్యటన అతని కెరీర్‌కు అత్యంత కీలకం కానుంది. ఇప్పటివరకు భారత్ తరఫున 46 టీ20 మ్యాచ్‌లు ఆడిన బిష్ణోయ్.. 7.58 ఎకానమీతో 64 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

జింబాబ్వే పర్యటనకు అప్‌డేట్ చేసిన భారత టీ20 జట్టు ఇదే: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాన్ష్ షెడ్జ్, రింకూ సింగ్, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us