Video: మైదానంలో వింత ఘటన.. అంపైర్ చేసిన పనికి షాకైన ఆర్సీబీ కెప్టెన్.. ఏం చేశాడంటే?

Rajat Patidar Funny Video: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ పోరులో ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. అంపైర్ పొరపాటున బెంగళూరు కెప్టెన్ నీళ్ల బాటిల్ తీసుకుని తాగడంతో, రజత్ పాటిదార్ ఒక్కసారిగా కంగారుపడి దానిని తిరిగి లాక్కున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.

Video: మైదానంలో వింత ఘటన.. అంపైర్ చేసిన పనికి షాకైన ఆర్సీబీ కెప్టెన్.. ఏం చేశాడంటే?
Rajat Patidar, Dinesh Karthik Fight With Umpire

Updated on: Apr 06, 2026 | 6:42 PM

Rajat Patidar Funny Video: డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుత సీజన్‌లో అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. ఆదివారం జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను 43 పరుగుల తేడాతో ఓడించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 250 పరుగుల భారీ స్కోరు సాధించగా, అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నై జట్టు 207 పరుగులకే పరిమితమైంది.

బ్యాటర్ల వీరవిహారం.. పరుగుల వరద..

చిన్నస్వామి స్టేడియం ప్రేక్షకులు బ్యాటర్ల ఊచకోతను కళ్లారా వీక్షించారు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, కెప్టెన్ రజత్ పాటిదార్ కేవలం 19 బంతుల్లోనే 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దేవదత్ పడిక్కల్ అర్ధశతకంతో రాణించగా, ఆఖర్లో టిమ్ డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లోనే 70 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరును అందించారు.

అంపైర్ చేసిన పనికి ఖంగుతిన్న పాటిదార్..

మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో డ్రింక్స్ బ్రేక్ దగ్గర ఒక వింత సన్నివేశం కనిపించింది. రజత్ పాటిదార్, పడిక్కల్ మైదానంలో విశ్రాంతి తీసుకుంటుండగా, అక్కడ ఉన్న అంపైర్ అనుకోకుండా పాటిదార్‌కు చెందిన వాటర్ బాటిల్‌ను తనది అనుకుని తీసుకుని తాగడం మొదలుపెట్టాడు. ఇది చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన పాటిదార్, వెంటనే అంపైర్ వద్దకు పరుగెత్తుకెళ్లి తన బాటిల్‌ను తిరిగి లాక్కున్నాడు. ఈ క్రమంలో మెంటర్ దినేష్ కార్తీక్ అంపైర్‌తో సరదాగా మాట్లాడగా, హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ మాత్రం గంభీరంగా చూస్తూ కనిపించాడు.

సిక్సర్ల వర్షాన్ని ఎంజాయ్ చేశాను: కెప్టెన్

మ్యాచ్ అనంతరం రజత్ పాటిదార్ మాట్లాడుతూ, తన జట్టు ప్రదర్శన పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. మైదానంలో బ్యాటర్లు బాదుతుంటే నాన్-స్ట్రైకర్ ఎండ్ నుంచి, డగౌట్ నుంచి సిక్సర్లను చూడటం చాలా ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. బౌలర్లపై ఒత్తిడి పెంచడమే తన లక్ష్యమని, జట్టు విజయం కోసం నిలకడగా ఆడటం సంతృప్తినిస్తుందని ఆయన వెల్లడించాడు. ఏప్రిల్ 10న గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో బెంగళూరు తదుపరి మ్యాచ్ ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us