RR vs CSK IPL 2026 Result: దంచికొట్టిన వైభవ్.. చెన్నైను చిత్తు చేసిన రాజస్థాన్..

Rajasthan Royals vs Chennai Super Kings Result, IPL 2026: ఐపీఎల్ మూడవ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఖాతా తెరిచింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ ఆటతో ఘన విజయం సాధిచింది. చెన్నై అందించిన 127 పరుగుల టార్గెట్ ను ఈజీగా ఛేదించింది.

RR vs CSK IPL 2026 Result: దంచికొట్టిన వైభవ్.. చెన్నైను చిత్తు చేసిన రాజస్థాన్..
Rr Vs Csk Ipl 2026 Result

Edited By:

Updated on: Mar 30, 2026 | 10:38 PM

Rajasthan Royals vs Chennai Super Kings Result, IPL 2026: ఐపీఎల్ మూడవ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఖాతా తెరిచింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ ఆటతో ఘన విజయం సాధిచింది. చెన్నై అందించిన 127 పరుగుల టార్గెట్ ను ఈజీగా ఛేదించింది. గౌహతిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై తరపున జేమీ ఓవర్టన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అరంగేట్రం చేసిన కార్తిక్ శర్మ 18 పరుగులు చేయగా, కీలక ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ 17 పరుగులు చేశాడు. ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ 10 పరుగుల మార్కును చేరుకోలేకపోయారు. 17 ఏళ్ల తర్వాత రాజస్థాన్ తరపున ఐపీఎల్‌లో ఆడిన రవీంద్ర జడేజా 2 వికెట్లు పడగొట్టి అద్భుతంగా రీఎంట్రీ ఇచ్చాడు. జోఫ్రా ఆర్చర్, నంద్రే బర్గర్ కూడాతలో 2 వికెట్లు పడగొట్టారు. సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, అరంగేట్రం చేసిన బ్రిజేష్ శర్మ చెరో వికెట్ తీశారు.

ఛేజింగ్ లో వైభవ్ దూకుడు..

వైభవ్ సూర్యవంశీ పవర్‌ప్లే చివరి ఓవర్‌లో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతను నూర్ అహ్మద్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది, కేవలం 15 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తిచేశాడు. పవర్‌ప్లేలో వైభవ్ ఐదు సిక్సర్లు కొట్టాడు. 305 స్ట్రైక్ రేట్‌తో పరుగుల వరద పారించాడు వైభవ్. దీంతో రాజస్థాన్ 6 ఓవర్లలో 74 పరుగులు చేసింది. ఆ తర్వాత రాజస్థాన్ విజయాన్ని అడ్డుకోవడం చెన్నై బౌలర్లకు సాధ్యం కాలేదు.

ఇరు జట్లు:

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మాత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ(కీపర్), జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురెల్(కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ.

Follow Us