గ్లెన్ మాక్స్‌వెల్, ఫాఫ్ డు ప్లెసిస్‌ల అర్ధ సెంచరీల కారణంగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్-16వ సీజన్‌లోని 32వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్‌కు 190 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది.
ఎం. చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లి తొలి బంతికే ట్రెంట్ బౌల్ట్‌కు బలయ్యాడు. ఆ తర్వాత జట్టు 12 పరుగుల వద్ద షాబాజ్ అహ్మద్ వికెట్ కోల్పోయింది. ఇక్కడి నుంచి గ్లెన్ మాక్స్‌వెల్, ఫాఫ్ డు ప్లెసిస్ సెంచరీ భాగస్వామ్యంతో జట్టు స్కోరును 135కు చేర్చారు. ఇక్కడి నుంచి ఏ బ్యాట్స్‌మెన్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ తలో 2 వికెట్లు తీశారు. రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్ చెరో వికెట్ తీశారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి(కెప్టెన్), ఫాఫ్ డు ప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్.
RCB ఇంపాక్ట్ ప్లేయర్స్: హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, ఆకాష్ దీప్, కర్ణ్ శర్మ, అనుజ్ రావత్.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కీపర్/కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.
RR ఇంపాక్ట్ ప్లేయర్స్: డోనావన్ ఫెరీరా, ఎం. అశ్విన్, ఆకాష్ వశిష్ట్, కేఎం ఆసిఫ్, అబ్దుల్ బాసిత్.
W 0⃣ W@rajasthanroyals fight back with vital wickets ??
What target will #RR be comfortable chasing on this surface?
Follow the match ▶️ https://t.co/lHmH28JwFm#TATAIPL | #RCBvRR pic.twitter.com/7sDrylU8iD
— IndianPremierLeague (@IPL) April 23, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..