Video: 2 ఓవర్లలో 2 పరుగులే.. స్వింగ్‌తో చెమటలు పట్టించిన బౌలర్.. వీడియో..

Trent Boult, IPL 2023: ఐపీఎల్ 2023 26వ మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. లక్నో జట్టును సుస్సు పోయించాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్ లక్నో సూపర్‌జెయింట్స్‌ను ఒక్కో పరుగు కోసం తీవ్రంగా శ్రమించేలా చేశాడు.

Video: 2 ఓవర్లలో 2 పరుగులే.. స్వింగ్‌తో చెమటలు పట్టించిన బౌలర్.. వీడియో..
Trent Boult

Updated on: Apr 19, 2023 | 9:54 PM

RR vs LSG: ఐపీఎల్ 2023 26వ మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. లక్నో జట్టును సుస్సు పోయించాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్ లక్నో సూపర్‌జెయింట్స్‌ను ఒక్కో పరుగు కోసం తీవ్రంగా శ్రమించేలా చేశాడు. రాహుల్, మేయర్స్ వంటి తుఫాను బ్యాట్స్‌మెన్‌ల ముందు బోల్ట్ డాట్ బాల్స్ విసిరాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన బోల్ట్ 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

బోల్ట్ పేరుతో ఒక వికెట్ మాత్రమే ఉండొచ్చు.. కానీ, ఈ ఆటగాడు లక్నో బ్యాట్స్‌మెన్‌ను స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. ఎప్పటిలాగే బోల్ట్ మరోసారి కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఆటగాడు మొదటి ఓవర్ మెయిడిన్‌గా విసిరాడు. తర్వాత ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పవర్‌ప్లేలో వేసిన రెండు ఓవర్లలో బోల్ట్ 11 బాల్ డాట్‌లు సంధించాడు.

ఇవి కూడా చదవండి

డాట్ బాల్స్‌తో భయపెట్టిన బోల్ట్..

బోల్ట్ 24 బంతుల్లో 18 డాట్ బాల్స్ విసిరాడు.ఇది నిజంగా అద్భుతమైనది. ఈ సీజన్‌లో బోల్ట్ కొత్త బంతిని గరిష్టంగా ఉపయోగించుకున్నాడు. తొలి ఓవర్‌లో వికెట్లు తీసిన ఘనతను ఇప్పటికే మూడుసార్లు చేశాడు. ట్రెంట్ బౌల్ట్ ఈ సీజన్‌లో తొలి ఓవర్‌లో మొత్తం 26 బాల్ డాట్‌లు వేశాడు. ఇందులో తొలి ఓవర్‌లోనే ఐదు వికెట్లు తీశాడు. అయితే, లక్నోపై వికెట్ పడడొట్టలేదు. కానీ, అతను ఒక మెయిడిన్ ఓవర్ వేయగలిగాడు.

బోల్ట్ అరుదైన ఫీట్..

ట్రెంట్ బౌల్ట్ ఐపీఎల్‌లో 8 సార్లు మొదటి ఓవర్‌ను విసిరాడు. ఈ ఘనత సాధించిన ఏకైక విదేశీ ఆటగాడిగా నిలిచాడు. భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్‌లో మొత్తం 8 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ప్రవీణ్ కుమార్ 7 ఓవర్లు మెయిడిన్ బౌలింగ్ చేశాడు.

బోల్ట్‌ తొలి ఓవర్‌లోనే వికెట్లు తీయడం అలవాటు చేసుకున్నాడు. విదేశీ ఆటగాళ్లలో బోల్ట్ ఇప్పటివరకు తొలి ఓవర్‌లోనే మొత్తం 20 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్ ఐపీఎల్‌లో తొలి ఓవర్‌లో 22 వికెట్లు పడగొట్టిన రికార్డు భువనేశ్వర్ కుమార్ పేరిట ఉంది. ప్రస్తుతం బోల్ట్ చేస్తున్న బౌలింగ్ చూస్తుంటే త్వరలోనే ఈ ఆటగాడు భువీని వెనక్కి నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..