Video: 7 ఫోర్లు, 3 సిక్సులతో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. ఉప్పల్‌లో హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు.. 240 స్ట్రైక్‌రేట్‌తో మారణహోమం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆదివారం తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.

Video: 7 ఫోర్లు, 3 సిక్సులతో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. ఉప్పల్‌లో హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు.. 240 స్ట్రైక్‌రేట్‌తో మారణహోమం..
Jos Buttler
Follow us
Venkata Chari

|

Updated on: Apr 02, 2023 | 4:50 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆదివారం తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. రాజస్థాన్ రాయల్స్ 13 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఊహించినట్లుగానే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మొదటి గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన కౌంటర్-ఎటాకింగ్‌తో బ్యాటింగ్ చేస్తోంది. ఇంగ్లీష్ బ్యాటర్ జోస్ బట్లర్ తన IPL 2023 ప్రచారాన్ని అద్భుతంగా మొదలుపెట్టాడు. కేవలం 22 బంతుల్లో 54 పరుగులు చేసిన బట్లర్ ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని కూడా నమోదు చేశాడు.

భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి బ్యాటింగ్ ప్రారంభించిన బట్లర్.. SRH బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. మొదటి రెండు ఓవర్ల తర్వాత, బట్లర్ తన గేర్‌ను మార్చాడు. భువనేశ్వర్ కుమార్‌ను కార్నర్‌ చేసుకుని అద్భుతంగా సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత ఉప్పల్‌లో మారణహోమం సృష్టించాడు. 54 పరుగుల వద్ద జోస్ బట్లర్ ఔటయ్యాడు. ఫరూఖీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. బట్లర్ తన 16వ ఐపీఎల్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

ఇవి కూడా చదవండి

బట్లర్-జైస్వాల్ భాగస్వామ్యం..

రాజస్థాన్ జట్టుకు ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ 35 బంతుల్లో 85 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని ఫజల్ హక్ ఫరూఖీ బ్రేక్ చేశాడు. బట్లర్‌ను బౌల్డ్ చేశాడు.

తుఫాన్ హాఫ్ సెంచరీ..

జోస్ బట్లర్ తన ఐపీఎల్ కెరీర్‌లో 16వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. 20 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. 22 బంతుల్లో 54 పరుగులు చేసి బట్లర్ ఔటయ్యాడు. అతను 245.45 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. బట్లర్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

సంజూ శాంసన్ ఆర్‌ఆర్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ఐడెన్ మార్క్రామ్ గైర్హాజరీలో భువనేశ్వర్ కుమార్ హైదరాబాద్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. అతను తన 250వ టీ20 మ్యాచ్‌ ఆడుతున్నాడు.

బట్లర్ తుఫాన్ ఇన్నింగ్స్ వీడియో..

ఇరు జట్లు:

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కీపర్/కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, కేఎం ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్(కీపర్), ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), టి. నటరాజన్, ఫజల్హాక్ ఫరూఖీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!