మ్యాచ్… వర్షం… ఓ మెమె

| Edited By:

Jun 13, 2019 | 9:19 PM

ఈ ఏడాది ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్ మాత్రం అభిమానులు ఆశలపై నీళ్లు జల్లుతోంది. ఈ టోర్నమెంట్ లీగ్ దశలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. తాజాగా నాటింగ్‌‌హామ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైంది. దీంతో అభిమానులు ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త వరల్డ్ కప్ అని ట్వీట్లతో ఐసీసీపై మండిపడుతున్నారు. ‘‘ప్రపంచకప్ […]

మ్యాచ్... వర్షం... ఓ మెమె
Follow us on

ఈ ఏడాది ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్ మాత్రం అభిమానులు ఆశలపై నీళ్లు జల్లుతోంది. ఈ టోర్నమెంట్ లీగ్ దశలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. తాజాగా నాటింగ్‌‌హామ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైంది. దీంతో అభిమానులు ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త వరల్డ్ కప్ అని ట్వీట్లతో ఐసీసీపై మండిపడుతున్నారు. ‘‘ప్రపంచకప్ అని చెప్పి.. కేవలం వర్షాన్ని చూపిస్తున్నారేంటి’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ‘‘ఐసీసీ క్రికెట్‌కు అనుకూలించే వేదికలను ఎంచుకోవడంలో విఫలమైంది’’ అని మరొకరు ట్వీట్ చేశారు.

https://twitter.com/TheViper_OffI/status/1139163922659971072