IND vs SA: పాయింట్లు తగ్గిస్తే ఇబ్బందేమి లేదు.. కానీ పరిస్థితులను అర్థం చేసుకోవాలి..

| Edited By: Ravi Kiran

Jan 03, 2022 | 9:46 AM

తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటిసి) పాయింట్‌ను కోల్పోయిన తమ జట్టు మెరుగైన చేయాలని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు.

IND vs SA: పాయింట్లు తగ్గిస్తే ఇబ్బందేమి లేదు.. కానీ పరిస్థితులను అర్థం చేసుకోవాలి..
Dravid
Follow us on

సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటిసి) పాయింట్‌ను కోల్పోయిన తమ జట్టు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆదివారం అంగీకరించాడు. ఓవర్ రేట్ తక్కువగా ఉంటే WTC పాయింట్ల నుండి తగ్గింపు ఏ జట్టుకైనా ఫైనల్‌కు చేరుకోవడం కష్టతరం చేస్తుంది. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ టెస్టులో ఎనిమిది ఓవర్లు తక్కువ సమయంలో బౌలింగ్ చేసినందుకు ఇంగ్లాండ్‌కు ఎనిమిది WTC పాయింట్లు జరిమానా విధించారు.

జోహన్నెస్‌బర్గ్‌లో రెండో టెస్టుకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో ద్రవిడ్ మాట్లాడుతూ “ఐసీసీ స్పష్టంగా ఏదో చేయాలని ప్రయత్నిస్తోంది. కోచ్‌గా ఇది చికాకు కలిగిస్తుంది. కొన్నిసార్లు ఇది కొంచెం నిరుత్సాహపరుస్తుందన్నారు. ఐసీసీ చేసిన కొత్త నిబంధనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే పాయింట్లను తగ్గించే ముందు పరిస్థితులపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని ద్రవిడ్ అన్నాడు. “ఐసీసీ ఇప్పుడు పాయింట్లను తగ్గించే పద్ధతిని అవలంబించింది. దీనితో మాకు ఎలాంటి సమస్య లేదు. అయితే పరిస్థితులకు అనుగుణంగా కొంత సడలింపు ఇవ్వాలి.” అని అన్నాడు.

“బుమ్రా గాయపడినప్పుడు, ఫిజియో చాలా సమయం (ఫీల్డ్‌లో) గడపవలసి వచ్చింది. చివరిసారి బంతిని మార్చడంలో కొన్ని ఇతర సమస్యలు ఉత్పన్నమయ్యాయి. భారత జట్టు నలుగురు ఫాస్ట్ బౌలర్లతో మ్యాచ్ ఆడుతుండడంతో ఓవర్ రేట్‎ను కొనసాగించడం జట్టుకు ఇబ్బందిగా మారింది.” అని పేర్కొన్నారు.

Read Also.. IND vs SA: భారత్‌తో వన్డే సిరీస్‌కి జట్టుని ప్రకటించిన సౌతాఫ్రికా.. స్థానం సంపాదించిన కొత్త బౌలర్..